Sai Dharam – Manchu Manoj : విరూపాక్ష సక్సెస్.. సాయి ధరమ్‌కి మంచు మనోజ్ బిర్యానీ పార్టీ!

సాయి ధరమ్ తేజ్ కమ్‌బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా 'విరూపాక్ష' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సక్సెస్ ని మంచు హీరో సెలబ్రేట్ చేస్తున్నాడు.

Sai Dharam – Manchu Manoj : విరూపాక్ష సక్సెస్.. సాయి ధరమ్‌కి మంచు మనోజ్ బిర్యానీ పార్టీ!

Manchu Manoj gave Biryani party to Sai Dharam Tej for Virupaksha success

Sai Dharam – Manchu Manoj : సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘విరూపాక్ష’ (Virupaksha). కొత్త దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సంయుక్త (Samyuktha Menon) హీరోయిన్ గా నటించింది. మిస్టికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీ ఇప్పటి వరకు 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఫస్ట్ తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన ఈ చిత్రం ఇటీవలే తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది.

Ustaad Bhagat Singh : పవన్ అభిమానితో హరీష్ శంకర్ డిబేట్.. ఫ్యాన్స్ మనోభావాలు పట్టించుకోరా?

అక్కడ కూడా మంచి సక్సెస్ ని అందుకుండడంతో మూవీ 100 కోట్ల మార్క్ క్రాస్ చేసి సాయి ధరమ్ ని 100 కోట్ల క్లబ్ లోకి తీసుకు రాబోతుంది. ఈ సక్సెస్ తో సుప్రీమ్ హీరో ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ఇక ఈ మెగా హీరో ఆనందాన్ని మంచు హీరో సెలబ్రేట్ చేస్తున్నాడు. తన కొత్త ఇంటిలో సాయి ధరమ్ కోసం ప్రత్యేకంగా తన ఫ్రెండ్ తో బిర్యానీ చేయించి పార్టీ ఇచ్చాడు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Celebrities Looks : లైఫ్ మ్యాంగోస్‌తో స్వీట్‌గా ఉంటుంది అంటున్న శ్రీలీల.. షిర్లీ సేఠియా సొగసులు..

ఇక మంచు మనోజ్ సినిమాలు విషయానికి వస్తే.. కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ హీరో ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ కాబోతున్నాడు. ఇటీవలే వాట్ ది ఫిష్ (What the Fish) అనే ఓ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు ‘మనం మనం బరంపురం’ అనే మూవీ కూడా చేయబోతున్నాడు. అలాగే ఇంకో సినిమా కూడా స్టోరీ సిట్టింగ్స్ లో ఉన్నట్లు తెలియజేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Manoj Manchu (@manojkmanchu)