What the Fish : భయం కొత్త రూపాన్ని తీసుకుంది.. మంచు మనోజ్ వాట్ ది ఫిష్ గ్లింప్స్ రిలీజ్..

మంచు మనోజ్ తన వాట్ ది ఫిష్ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని రిలీజ్ చేశాడు. గ్లింప్స్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. చూసేయండి మీరు కూడా..

What the Fish : భయం కొత్త రూపాన్ని తీసుకుంది.. మంచు మనోజ్ వాట్ ది ఫిష్ గ్లింప్స్ రిలీజ్..

Manchu Manoj What the Fish First Look Glimpse released

Manchu Manoj What the Fish : మంచు మనోజ్ కొంత కాలంగా సినిమాల్లో కనిపించడం లేదన్న విషయం అందరికి తెలిసిందే. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో రాకింగ్ స్టార్ అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్న మనోజ్.. చివరిగా 2017లో ఒక్కడు మిగిలాడు (Okkadu Migiladu) సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. ఆ తరువాత ఓ రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. 2018 నుంచి ఈ మంచు హీరో బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. ఒక సమయంలో మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి.

Bichagadu 2 : ‘బిచ్చగాడు’కి కలిసొచ్చిన 2 వేల నోటు రద్దు.. మొదటిరోజు కలెక్షన్స్ అదుర్స్!

ఇక ఇటీవలే మళ్ళీ సినిమాలు గురించి మాట్లాడుతూ.. తన కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తూ, తను ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నాను అని తెలియజేశాడు. ఇటీవల వాట్ ది ఫిష్ (What The Fish) అనే సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈరోజు (మే 20) మనోజ్ బర్త్ డే కావడంతో.. మూవీలోని మనోజ్ లుక్ ని రిలీజ్ చేశారు. గ్లింప్స్ లో గేమింగ్, డ్రగ్స్ వంటి సీన్స్ చూపించారు. అలాగే మనోజ్ ని కూడా గుడ్ అండ్ బ్యాడ్ లుక్స్ లో చూపించారు. ఇక ఈ గ్లింప్స్ కి మనోజ్.. ‘భయం కొత్త రూపాన్ని తీసుకుంది’ అంటూ కామెంట్ రాసుకొచ్చాడు.

Suriya : తెలుగు అమ్మాయి మృతి.. తమిళ హీరో సూర్య ఎమోషనల్.. ఆ కుటుంబానికి లేఖ!

దీంతో ఈ సినిమా ఒక కొత్త కాన్సెప్ట్ రాబోతుందని తెలుస్తుంది. కొత్త దర్శకుడు వరుణ్ కోరుకొండ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. విశాల్ అండ్ సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ మరియు నటీనటులు గురించి అప్డేట్ రావాల్సి ఉంది. మరి మనోజ్ ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు ఎప్పుడు తీసుకు వస్తాడో చూడాలి.