Manchu Mohan Babu: మంచు వారి ‘అగ్ని నక్షత్రం’!

కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు ఇటీవల ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఆ సినిమా ఘోర పరాజయం పాలయ్యింది.....

Manchu Mohan Babu: మంచు వారి ‘అగ్ని నక్షత్రం’!

Manchu Mohan Babu Manchu Lakshmi Movie Titled Agni Nakshatram

Manchu Mohan Babu: కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు ఇటీవల ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఆ సినిమా ఘోర పరాజయం పాలయ్యింది. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్‌తో నిరాశకు గురైన తమ అభిమానుల కోసం త్వరలో మరో కొత్త ప్రాజెక్టుతో మోహన్ బాబు మన ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ కూడా కలిసి నటిస్తుండటం. ఈ తండ్రీకూతుళ్లు కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

Manchu Mohanbabu: నేను ఏమీ మాట్లాడను.. నన్ను వదిలేయండి.. కోర్టుకు హాజరైన మంచు కుటుంబం..

అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాకు ‘‘అగ్ని నక్షత్రం’’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ సినిమా టైటిల్ లాంఛ్ కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం 9.29 గంటలకు ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమా టైటిల్ లాంఛ్ వీడియో చూస్తే, ఇదొక పోలీస్ థ్రిల్లర్ మూవీగా మనకు కనిపిస్తుంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని, మలయాళ నటుడు సిద్ధిక్, విశ్వంత్, జబర్దస్త్ మహేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

Manchu Lakshmi : మోహన్ బాబు తిరుపతి ఇంటిని చూశారా? మంచు లక్ష్మి హోమ్ టూర్..

కాగా, ఈ సినిమాను శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ అందించారు. ఈ సినిమాలో తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని.. తన కల ఇప్పటికి నెరవేరిందని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. అటు ఈ సినిమా షూటింగ్ సమయంలో మంచు లక్ష్మీలో తన కూతురు కంటే కూడా ఆమె చేస్తున్న పాత్రనే చూశానంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఈ సినిమాను ప్రతీక్ ప్రజోష్ డైరెక్ట్ చేయగా, లిజో కె జోస్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ అగ్ని నక్షత్రం చిత్రం మంచు వారికి ఎలాంటి రిజల్ట్‌ను అందిస్తుందో చూడాలి.