Manchu Vishnu : ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు నాకు అందలేదు: మంచు విష్ణు

ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేశారని నాకు మీడియా ద్వారానే తెలిసింది. ఇప్పటి వరకూ నా దగ్గరికి రాజీనామా లేఖలు రాలేదని

Manchu Vishnu : ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు నాకు అందలేదు: మంచు విష్ణు

Vishnu

Manchu Vishnu :  ‘మా’ ఎలక్షన్స్ అయిపోయాక కూడా ఇంకా ఆ వేడి తగ్గినట్టు కనిపించట్లేదు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ‘మా’ ఎలక్షన్స్ పై కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ‘మా’ ఎలక్షన్స్ అయిపోయాక ఎలక్షన్స్ సరిగా జరగలేదని, రౌడీయిజం చూపించారని, బూతులు తిట్టారని ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు రాజీనామా చేశారు. ఇది మీడియా ముందే ప్రకటించారు. మంచు విష్ణుకి రాజీనామాలు అందిస్తామని కూడా ప్రకటించారు. తాజాగా ఈ విషయంపై మంచు విష్ణు స్పందించారు.

నిన్న తిరుపతి దర్శనానికి వచ్చిన మంచు విష్ణు దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. తన ప్యానల్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడితేనే తాను అధ్యక్షుడు అయ్యానని తెలిపాడు. నా ప్యానల్ సభ్యులకు అద్భుతమైన పనులు చేయడానికి బలం ప్రసాదించమని శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు. స్వామివారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చామని తెలిపారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ గురించి మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేశారని నాకు మీడియా ద్వారానే తెలిసింది. ఇప్పటి వరకూ నా దగ్గరికి రాజీనామా లేఖలు రాలేదని స్పష్టం చేశారు. ‘మా’ వద్దకు రాజీనామా లేఖలు వస్తే అప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుతానని అన్నారు.

Balakrishna : మరోసారి ఫ్యాక్షన్ సినిమాతో రాబోతున్న బాలయ్య బాబు

మరి ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు రాజీనామాలు ఇంకా ‘మా’కి అందించలేదా అనే సందేహం కలుగుతుంది. విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలపై రాజీనామాల విషయంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి.