MAA President Manchu Vishnu: మంచు విష్ణుకు పవన్ కల్యాణ్ సలహా.. ఇదే..!

హైదరాబాద్ లో అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్, మంచు విష్ణు మాట్లాడుకోలేదని.. ఎడమొహం, పెడమొహంగా ఉన్నారని వచ్చిన వార్తలపై.. మా..ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు.

10TV Telugu News

హైదరాబాద్ లో అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్, మంచు విష్ణు మాట్లాడుకోలేదని.. ఎడమొహం, పెడమొహంగా ఉన్నారని వచ్చిన వార్తలపై.. మా..ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం.. ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు విష్ణు బదులిచ్చారు.

పవన్ కల్యాణ్, తానూ.. అక్కడ మాట్లాడుకున్నామని విష్ణు స్పష్టం చేశారు. కాసేపటికి అక్కడ మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉన్నారన్న కారణంగా.. సైలెంట్ గా ఉన్నట్టు చెప్పారు. అంతే తప్ప.. తాము మాట్లాడుకోలేదన్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. పవన్, తాను మాట్లాడుకున్న సందర్భాన్ని మీడియా కవర్ చేయలేదని.. అందుకే ఈ రూమర్స్ అని విష్ణు వివరించారు.  అది మాత్రమే కాకుండా.. మా.. టాలీవుడ్ కు తల్లివంటిదని.. జాగ్రత్తగా చూసుకోవాలని పవన్ తనకు చెప్పినట్టు విష్ణు వెల్లడించారు.

మోహన్ బాబుతో చిరంజీవి మాట్లాడినట్టుగా వచ్చిన వార్తలపైనా విష్ణు స్పందించారు. అది నిజమే అని.. పూర్తి వివరాలను తన తండ్రి మోహన్ బాబుతోనే మాట్లాడితే బాగుంటుందని అన్నారు. మెగా కుటుంబంతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని.. అవి కొనసాగుతాయని కూడా చెప్పారు. పవన్ కల్యాణ్ పై తాను చేసిన ట్వీట్ పైనా వివరణ ఇచ్చిన విష్ణు.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందపడాలనే తాను ట్వీట్ చేశానన్నారు.

Read More:

Manchu Vishnu: పవన్ కళ్యాణ్‌పై మంచు విష్ణు ట్వీట్.. నెట్టింట్లో వీడియో వైరల్!

Manchu Vishnu : ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు నాకు అందలేదు: మంచు విష్ణు