మంచు వారి వేడి వేడి కొబ్బరిబోండాం చికెన్ రైస్ రెడీ..

మంచు విష్ణు కొబ్బరిబోండాం చికెన్ రైస్ వంటకం..

  • Edited By: sekhar , April 15, 2020 / 05:26 PM IST
మంచు వారి వేడి వేడి కొబ్బరిబోండాం చికెన్ రైస్ రెడీ..

మంచు విష్ణు కొబ్బరిబోండాం చికెన్ రైస్ వంటకం..

లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన జనాలు కరోనా అప్‌డేట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో వెబ్ సిరీస్, సినిమాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనుల తాలుకూ విషయాలను వీడియో రూపంలో ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు.

తాజాగా మంచు విష్ణు కొబ్బరిబొండాంతో చేసిన వెరైటీ వంటకాన్ని తన ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశాడు. అది అలాంటి ఇలాంటి వంటకం కాదండోయ్.. కొబ్బరిబొండాంలో చికెన్‌ రైస్‌.. వినడానికే విచిత్రంగా ఉంది కదూ.. మరదే మంచు వారి స్పెషాలిటీ. మోహన్ బాబు, నిర్మల, మంచు లక్ష్మీ చుట్టూ రౌండప్ చేయగా విష్ణు ఈ కోకోనట్ చికెన్ రైస్ తయారు చేశాడు.

Read Also : ప్రముఖ నటుడు రంజిత్ చౌదరి ఇకలేరు

Manchu Vishnu Cooked Chicken Rice Coconut

అయితే కొబ్బరి బొండాంలో చికెన్‌ రైస్ వండి తను అనుకున్నది సాధించినాని ఫీలింగ్ కలిగినా ఇప్పుడు చేసిన ప్రయోగం మాత్రం అంతగా సక్సెస్‌ కాలేదని, లాక్‌డౌన్‌ పూర్తయ్యేలోపు కచ్చితంగా టేస్టీగా కొబ్బరిబొండాంలో చికెన్‌ రైస్‌ వండుతానని తెలిపాడు. అంతేగాక చివర్లో లాక్‌డౌన్‌ పుణ్యమా అని చాలా ఓపికతో మంచి చెఫ్‌గా తయారనంటూ వీడియో పోస్ట్ చేశాడు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో విష్ణు భార్య పిల్లలు అమెరికాలో చిక్కుకుపోయారు.