మంచు మనసు: ఆస్పత్రికి రూ.కోటి విరాళం

మంచు మనసు: ఆస్పత్రికి రూ.కోటి విరాళం

మంచు మనసు: ఆస్పత్రికి రూ.కోటి విరాళం

టాలీవుడ్ నటుడు మంచు విష్ణూ తన ఉదారతను చాటుకున్నాడు. తండ్రి మంచు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలోని రూయా ఆసుపత్రికి రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆస్పత్రిలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఈ డబ్బు ఉపయోగించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఎమర్జెన్సీ, ఓపీడీ బ్లాక్‌ను కూడా నిర్మించనున్నట్లు విష్ణు వెల్లడించారు. మూడేళ్ల కాలంలో రూ. కోటి మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు.

ప్రజా సమస్యలపై స్పందించటంలో.. ప్రజలను ఆదుకోవటంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలి ఎప్పుడూ ముందుంటుంది. అనేక అంశాల్లో మోహన్ బాబు తన వైఖరిని నిర్మొహమాటంగా చెబుతుంటారు. ప్రకృతి విపత్తుల సమయంలోనే మంచు ఫ్యామిలీ స్పందించే తీరు ప్రత్యేకం. ఈసారి తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాల కల్పన కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించటం విశేషం.

×