Manchu Vishnu : హీరోయిన్స్ పై పిచ్చి పిచ్చి థంబ్‌నైల్స్‌ పెడితే ఊరుకోను.. యూట్యూబ్ ఛానల్స్ కి మంచు విష్ణు హెచ్చరిక

గత కొద్ది కాలంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టమొచ్చినట్టు థంబ్‌నైల్స్‌ పెడుతూ అసత్యాలని ప్రచారం చేస్తున్నాయి. వ్యూస్, లైక్స్ కోసం అడ్డమైన దార్లు తొక్కుతున్నాయి యూట్యూబ్ ఛానల్స్.

Manchu Vishnu : హీరోయిన్స్ పై పిచ్చి పిచ్చి థంబ్‌నైల్స్‌ పెడితే ఊరుకోను.. యూట్యూబ్ ఛానల్స్ కి మంచు విష్ణు హెచ్చరిక

Manchu Vishnu

Manchu Vishnu :  గత కొద్ది కాలంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇష్టమొచ్చినట్టు థంబ్‌నైల్స్‌ పెడుతూ అసత్యాలని ప్రచారం చేస్తున్నాయి. వ్యూస్, లైక్స్ కోసం అడ్డమైన దార్లు తొక్కుతున్నాయి యూట్యూబ్ ఛానల్స్. వీటిపై ఇప్పటికే చాలా మంది సీరియస్ అయ్యారు. కొంతమంది కంప్లైంట్స్ ఇచ్చారు. కానీ వాటి తీరు మారట్లేదు. ఇటీవల సమంత కూడా తన విడాకుల విషయంలో అసత్యాలని ప్రచారం చేశాయని మూడు యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టులో కేసు వేసింది. తాజాగా ఈ సమస్య పై ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు స్పందించారు.

Bigg Boss 5 : ఈ సారి నామినేషన్ లో ఉన్నది ఎవరెవరు??

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) లో మహిళల భద్రత, సాధికారత కోసం ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇటీవల ప్రకటించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌ ను ఏర్పాటు చేశారు. ‘మా’లోని మహిళల సాధికారిత కోసం ఈ కమిటీ పనిచేస్తుందని విష్ణు తన ట్విటర్‌లో పేర్కొన్నారు.

Bandla Ganesh : ఆ స్వామిజి బయోపిక్ నేనే తీస్తా : బండ్ల గణేష్

ఆ తర్వాత తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు మాట్లాడుతూ.. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లపై మండిపడ్డారు. నటీమణులు, హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపెక్షించేది లేదని హెచ్చిరించారు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు ఆర్టిస్టుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని, అసభ్యకర రీతిలో వారిపై రూమర్లు క్రియేట్‌ చేస్తు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయన్నారు. అలాంటి ఛానళ్లపై చర్యలు తప్పవన్నారు. ఇక యూట్యూబ్‌ ఛానళ్లలో థంబ్‌నైల్స్‌ హద్దులు మీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నటీమణులు మన ఆడపడుచులని, వారిని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు విష్ణు. యూట్యూబ్‌ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాను అని విష్ణు తెలిపారు.