Manchu Vishnu: మంచు విష్ణు ‘జిన్నా’ మూవీ సెన్సార్ రిపోర్ట్

యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు సూర్య తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Manchu Vishnu: మంచు విష్ణు ‘జిన్నా’ మూవీ సెన్సార్ రిపోర్ట్

Manchu Vishnu Ginna Movie Completes Censor Work

Manchu Vishnu: యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు సూర్య తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు మరోసారి తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు.

Manchu Vishnu : దమ్ముంటే వాళ్ళ అడ్రస్ పెట్టమనండి.. ట్రోలర్స్ పై మంచు విష్ణు వ్యాఖ్యలు..

ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. జిన్నా సినిమాలోని కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉందని.. ఈ సినిమాతో మంచు విష్ణు మంచి విజయాన్ని అందుకుంటాడని సెన్సార్ బోర్డు సభ్యులు కితాబిచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలోని కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Ginna: రంగంపేట ప్రెసిడెంట్ తిప్పేస్వామిగా ఎంట్రీ ఇచ్చిన రఘుబాబు

ఈ సినిమాలో మంచు విష్ణు పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని, హీరోయిన్లు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌ల పాత్రలు కూడా అందరికీ నచ్చుతాయని వారు చెబుతున్నారు. పలువురు కమెడియన్లు ఈ సినిమాలో నటిస్తుండగా, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మంచు విష్ణు ఈ సినిమాను స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.