MAA Elections 2021 : పవన్ కళ్యాణ్ కామెంట్స్‌తో నేను ఏకీభవించట్లేదు..

‘మా’ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించట్లేదని స్పష్టం చేశారు మంచు విష్ణు..

MAA Elections 2021 : పవన్ కళ్యాణ్ కామెంట్స్‌తో నేను ఏకీభవించట్లేదు..

Manchu Vishnu

MAA Elections 2021: ఈ ఏడాది ‘మా’ ఎన్నికల హోరు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. నామినేషన్ కోసం భారీ ర్యాలీతో ఫిలిం ఛాంబర్ వద్దకు చేరుకున్న మంచువిష్ణు దర్శకరత్న, స్వర్గీయ దాసరి నారాయణరావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం 1:19 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు.

Love Story Magical Success Meet : నాగార్జున – సుకుమార్ అతిథులుగా..

‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు మరియు అతని ప్యానెల్ సభ్యులు నామినేషన్స్ దాఖలు చేశారు. ఈ మేరకు ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు మంచు విష్ణు అండ్ టీమ్ నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేసిన తర్వాత మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ‘మా’ ఎన్నికలు పొలిటికల్ ఎజెండా ద్వారా నడుస్తున్నాయని అంటున్నారు.. జగన్ మీకు బావ, బంధువు.. ఇదంతా ఏపీ గవర్నమెంట్ బ్యాకప్‌గా ఉందన్న చర్చ జరుగుతోంది.. దీని గురించి పవన్ కళ్యాణ్ కూడా కామెంట్స్ చేశారు.. అని ప్రశ్నించగా..

చిరు, పవన్ ఓట్లు నాకే..
మంచు విష్ణు.. ‘ఆ చర్చ మీడియా వారు మీరే చెయ్యండి.. దీని వెనుక ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో మీరే చెప్పండి.. నేను మా ప్యానెల్ సభ్యులను పరిచయం చేసినప్పుడే శిరస్సు వంచి చెప్పాను.. ఇందులో ఏ రాజకీయ పార్టీ జోక్యం చేసుకోవద్దని.. ‘మా’ లో ఓటువేసే 900 మంది సభ్యుల సపోర్ట్ ఉంది. నా మ్యానిఫెస్టో మీద నాకు నమ్మకముంది. అది చూసి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు నాకే ఓటేస్తారు’ అన్నారు.

MAA Elections 2021 : ‘మా’ సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు.. కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..

పవన్ కళ్యాణ్, మోహన్ బాబుని అడిగిన ప్రశ్నల గురించి స్పందిస్తూ.. ‘పవన్ కళ్యాణ్ గారు మా నాన్న గారిని కొన్ని ప్రశ్నలడిగిన విషయం మేం మీడియా ద్వారా తెలుసుకున్నాం.. నాన్న గారే దానికి సమాధానం చెప్తారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ప్రశ్నకు నాన్న గారు సమాధానం చెప్తారు’ అన్నారు..

Vijay – Mahesh : ఫ్రెండ్ కోసం సూపర్‌స్టార్ మహేశ్

ఇక ఏపీ ప్రభుత్వం తన ఒక్కడి వల్ల తెలుగు సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతుంది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తెలుగు ఫిలిం ఛాంబర్‌కి సంబంధం లేదని ప్రెసిడెంట్ నారయణ దాస్ నారంగ్ గారు లెటర్‌లో పేర్కొన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఒక నటుడిగా, నిర్మాతగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించట్లేదు.. నారయణ దాస్ నారంగ్ గారు ఇచ్చిన లేఖతో నేను ఏకీభవిస్తున్నాను’ అన్నారు.