Manchu Vishnu : చిరంజీవిని కలిసేందుకు వెళ్తున్నా- విష్ణు

ఇప్పటికే.. సీనియర్లు సత్యనారాయణ, కోట, పరుచూరి బ్రదర్స్ ను కలిశానని... తనకు క్లోజ్ గా ఉన్న వాళ్లందరినీ కలిసి ఆశీర్వాదం తీసుకుంటానన్నారు విష్ణు.

10TV Telugu News

Manchu Vishnu : ఈ ఉదయం( అక్టోబర్ 14, 2021 గురువారం ) హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు తండ్రీ కొడుకులు మోహన్ బాబు, విష్ణు. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత… సీనియర్లతో మర్యాద పూర్వక భేటీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే బాలయ్యను కలిశారు.

Balakrishna : బాలకృష్ణతో మోహన్ బాబు, విష్ణు చర్చలు.. ‘మా’ కోసమేనా??

“మద్దతిచ్చిన బాల అన్నకు ధన్యవాదాలు. అన్నను కలిశాను. కృతజ్ఞత తెలిపాను. ‘మా’ కోసం ఎప్పుడు సలహా కోరినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ‘మా’ కుటుంబాన్ని ఒక్కటిగా చేసే ప్రయత్నాల్లో నాకు సహకరిస్తా అన్నారు. మా సభ్యులందరినీ ఒక్కటిగా ఉంచడమే నా ప్రస్తుత అజెండా” అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.

ఇప్పటికే.. సీనియర్లు సత్యనారాయణ, కోట, పరుచూరి బ్రదర్స్ ను కలిశానని… తనకు క్లోజ్ గా ఉన్న వాళ్లందరినీ కలిసి ఆశీర్వాదం తీసుకుంటానన్నారు విష్ణు. చిరంజీవిని కూడా తప్పకుండా కలుస్తానని చెప్పారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులందరే కాకుండా.. మిగిలిన అందరినీ మర్యాదపూర్వకంగా కలిసి వస్తానని మీడియాతో చెప్పారు మంచు విష్ణు.

Drones Drop Food, Water : కుక్కలకు డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు సరఫరా..ఎందుకంటే?