Manchu Vishnu : సన్నీలియోన్ తో మంచు విష్ణు సరదా ఆటలు.. తోడుగా శివబాలాజీ..

తాజాగా సన్నీ లియోన్ ఓ వీడియోని షేర్ చేసింది. ఇందులో సన్నీ లియోన్, మంచు విష్ణు, శివ బాలాజీ కలిసి గేమ్ ఆడుకుంటున్నారు. ఈ వీడియోని సన్నీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Manchu Vishnu : సన్నీలియోన్ తో మంచు విష్ణు సరదా ఆటలు.. తోడుగా శివబాలాజీ..

Sunny

 

Sunny Leone :  మంచు విష్ణుని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో దొరికినప్పుడల్లా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు కూడా దానికి తగ్గట్టే ట్వీట్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఇటీవల మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు అనే సినిమాని అనౌన్స్ చేశాడు. ఇందులో సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ఇక సన్నీ లియోన్ మంచు విష్ణు సినిమాలో నటిస్తుంది అని ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ మళ్ళీ మొదలు పెట్టారు.

 

ఆ ట్రోల్స్ కి మరింత ఊతం ఇచ్చేలా మంచు విష్ణు సన్నీ లియోన్ తో కలిసి ఉన్న ఫోటోలు, సరదా వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇటీవలే సన్నీ మంచు విష్ణుని భయపెట్టినట్టు చేసిన వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో బాగా వైరల్ అయి విష్ణుని సోషల్ మీడియాలో తెగ ఆడేసుకున్నారు. తాజాగా సన్నీ లియోన్ ఓ వీడియోని షేర్ చేసింది. ఇందులో సన్నీ లియోన్, మంచు విష్ణు, శివ బాలాజీ కలిసి గేమ్ ఆడుకుంటున్నారు. ఆ గేమ్ లో ఒకరు మధ్యలో ఉండి ఇద్దర్ని కొట్టడానికి ట్రై చేసే లోపు మనం బాటిల్ తో కొట్టాలి తగిలితే అవుట్. ఇలాంటి చిన్న పిల్లలు సరదాగా ఆడుకునే గేమ్ ని ఆడారు. ఈ వీడియోని సన్నీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Pawan Kalyan : సుమక్క సినిమా కోసం రంగంలోకి పవర్ స్టార్..

 

దీంతో మరోసారి మీమర్స్, ట్రోలర్స్ కి మంచి కంటెంట్ ఇచ్చాడు మంచు విష్ణు. ఈ వీడియోని కూడా సరదాగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇలా సన్నీని తీసుకొచ్చి వరుసగా ఇలా వీడియోలు చేయడం కూడా ప్రమోషన్స్ లో ఓ భాగమే అంటున్నారు కొంతమంది. ఇటీవల సినిమాలేవీ సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఇలా చేస్తున్నారు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సన్నీ లియోన్ ఉంటే థియేటర్ కి జనాలు వస్తారని అందుకే తెచ్చారని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి సన్నీలియోన్ ని చూసి అయినా మంచు విష్ణు సినిమాకి జనాలు వస్తారేమో చూడాలి.