Shiva Shankar Master : శివశంకర్ మాస్టర్‌కి అండగా ఉంటాను.. హాస్పిటల్ వైద్యులతో మాట్లాడిన మంచు విష్ణు

సెలబ్రిటీలు ఇప్పటికే కొంతమంది శివశంకర్ మాస్టర్ కి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. తాజాగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మంచు విష్ణు ఆరా తీశారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యులతో మంచు విష్ణు......

Shiva Shankar Master : శివశంకర్ మాస్టర్‌కి అండగా ఉంటాను.. హాస్పిటల్ వైద్యులతో మాట్లాడిన మంచు విష్ణు

Shivashankar Master

Shiva Shankar Master :  ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్ కి కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా హైదరాబాద్ AIG ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 75 శాతం పైగా ఊపిరితిత్తులు పాడయ్యాయని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. మాస్టర్ మాత్రమే కాక ఆయన కుటుంబంలో ఆయన భార్యకి, పెద్ద కొడుక్కి కూడా కరోనా సోకింది. పెద్ద కొడుకుకి కూడా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఆయన భార్య మాత్రం హోం క్వారంటైన్ లో ఉన్నారు.

Heros : కమల్‌హాసన్ నుంచి సంపూర్ణేష్ బాబు వరకు నగ్నంగా నటించిన హీరోలు వీళ్ళే

శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు అజయ్ అందరి బాగోగులు చూసుకుంటున్నాడు, శివశంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమౌతోందని, రోజుకు లక్ష రూపాయల దాకా వైద్య ఖర్చుల అవుతోందని సమాచారం. ఎన్నో గొప్పపాటలకు నృత్యాలను సమకూర్చి, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన శివశంకర్ మాస్టర్ కు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని అభిప్రాయపడుతున్నారు.

Samantha : బైసెక్సువల్ లేడీగా సమంత.. సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీ..

అయితే సెలబ్రిటీలు ఇప్పటికే కొంతమంది శివశంకర్ మాస్టర్ కి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే సోనుసూద్, హీరో ధనుష్ శివ శంకర్ మాస్టర్ వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తామని తెలిపారు. తాజాగా శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మంచు విష్ణు ఆరా తీశారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యులతో మంచు విష్ణు మాట్లాడారు. శివశంకర్ మాస్టర్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులని కోరారు. శివశంకర్ మాస్టర్ కుమారుడు అజయ్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అంతేకాక శివశంకర్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటామని మంచు విష్ణు హామీ ఇచ్చారు. ఆయన త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.