Manchu Vishnu : సీనియర్ నటిని ‘మా’ నుంచి బహిష్కరించిన మంచు విష్ణు.. షాక్ లో ‘మా’ సభ్యులు

'మా' అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ నటి శ్రీనిజను 'మా' నుంచి బహిష్కరించారు. ఆమెను ‘మా’ శాశ్వత సభ్యత్వం నుంచి నిరవధికంగా సస్పెండ్ చేశారు. పలు

Manchu Vishnu : సీనియర్ నటిని ‘మా’ నుంచి బహిష్కరించిన మంచు విష్ణు.. షాక్ లో ‘మా’ సభ్యులు

Srinija

Manchu Vishnu :  టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎన్నో వివాదాల మధ్య జరిగి చివరికి మంచు విష్ణు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ‘మా’ వివాదం కొన్ని రోజులు సాగింది. ఇటీవలే ‘మా’ వివాదాలు తగ్గుముఖం పట్టాయి. మంచు విష్ణు తాను ఇచ్చిన హామీల కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. కొత్త కొత్త నిర్ణయాలతో తన మార్క్ ని సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు విష్ణు. తాజాగా విష్ణు తీసుకున్న నిర్ణయం అందర్నీ షాక్ కి గురి చేసింది.

Mega Family : మెగా – అల్లు ఫ్యామిలీల దీపావళి

‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ నటి శ్రీనిజను ‘మా’ నుంచి బహిష్కరించారు. ఆమెను ‘మా’ శాశ్వత సభ్యత్వం నుంచి నిరవధికంగా సస్పెండ్ చేశారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటి శ్రీనిజ చేసింది. ‘డైవర్షన్ ఆంటీ’గా సోషల్ మీడియాలో కూడా పాపులర్ అయ్యారు. ఈమె చాలా కాలంగా ‘మా’ సభ్యురాలిగా ఉంది. మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన రోజు శ్రీనిజ వేదిక దగ్గరికొచ్చి గొడవ చేసింది. మోహన్ బాబును తిడుతూ శ్రీనిజ రెచ్చిపోయిన వీడియోలు వైరల్ అయ్యాయి. పోలీసులు వారించినా కూడా ఆమె వినలేదు. మోహన్ బాబు మోసం చేసాడని, విష్ణుకి అధ్యక్షుడయ్యే అర్హత లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Bigg Boss 5 : ఇద్దరూ చెరో వైపు ముద్దు పెట్టండి : జెస్సి

దీంతో మోహన్ బాబును బూతులు తిట్టినందుకు నటి శ్రీనిజను ‘మా’ శాశ్వత సభ్యత్వం నుంచి నిరవధికంగా సస్పెండ్ చేశారు. అక్టోబర్ 23వ తేదీన జరిగిన ‘మా’ ఈసీ సమావేశంలో నిర్ణయం తీసుకొని ‘మా’ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ శ్రీనిజకు ఒక షోకాజ్ నోటీస్‌ పంపారు. నోటీసులకు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే నేరుగా చర్యలు ఉంటాయని శ్రీనిజకు పంపిన నోటీసులో తెలిపారు. స్పందించిన శ్రీనిజ గడువులోపే వివరణ ఇచ్చుకుంది. కానీ ఆమె ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని భావించిన మంచు విష్ణు, ‘మా’ కొత్త కమిటీ నటి శ్రీనిజను అసోసియేషన్ నుంచి బహిష్కరించింది.

Bigg Boss 5 : విలన్స్ వర్సెస్ హీరోస్.. బిగ్ బాస్ లో బిగ్ ఫైట్

శ్రీనిజ.. తాను మోహన్ బాబును ఎందుకు తిట్టాల్సి వచ్చిందో పలు ఇంటర్వ్యూలలో వివరించారు. సాధారణంగా ఎవరైనా సభ్యులు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వారిని పిలిచి మందలించడం జరుగుతుంది. కానీ శ్రీనిజ విషయంలో ఇంత తీవ్రమైన చర్య తీసుకోవడం పట్ల చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మొదట్లోనే మంచు విష్ణు అసమ్మతిదారులపై ఇలాంటి చర్యలు తీసుకోవడంతో ‘మా’ సభ్యులు షాక్ కి గురయ్యారు.