Mangli Bonalu Song 2021 : బోనాల సాంగ్..లిరిక్స్ మార్చేసిన మంగ్లీ

జులై 11న రిలీజ్‌ చేసిన పాటలో లిరిక్స్ మాత్రం వివాదాస్పదమయ్యాయి. మంగ్లీ పాడిన పాటలో అమ్మవారిని తిడుతున్నట్లు ఉందని కొందరు వాదిస్తున్నారు. లిరిక్స్‌లో కొన్ని తప్పులు ఉన్నాయని.. వెంటనే ఆ సాంగ్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరారు.

Mangli Bonalu Song 2021 : బోనాల సాంగ్..లిరిక్స్ మార్చేసిన మంగ్లీ

Mangli

Mangli Bonalu Song : సింగర్‌ మంగ్లీ పాటలంటే.. తెలంగాణలో ఆమెకు చాలానే క్రేజ్ ఉంది. ఆమె పాట కోసం ఎదురుచూసే అభిమానులున్నారు. పండగలకన్నా ముందే.. ఆమె పాడే పాటలు సందడిని తీసుకొస్తాయి. అందుకే ఆమెకంత క్రేజ్‌. ప్రతి ఏడాది బోనాల పండగ సమయంలో ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు మంగ్లీ. ఇదే బాటలో ఈ ఏడాది రిలీజ్ చేసిన బోనాల స్పెషల్ సాంగ్ కూడా యూట్యూబ్‌ను షేక్ చేసింది.

Read More : Mansas Trust : జీతాలు అడిగితే కేసులు పెట్టడం దారుణం – అశోక్ గజపతి రాజు

అయితే జులై 11న రిలీజ్‌ చేసిన పాటలో లిరిక్స్ మాత్రం వివాదాస్పదమయ్యాయి. మంగ్లీ పాడిన పాటలో అమ్మవారిని తిడుతున్నట్లు ఉందని కొందరు వాదిస్తున్నారు. లిరిక్స్‌లో కొన్ని తప్పులు ఉన్నాయని.. వెంటనే ఆ సాంగ్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరారు. సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేయాలని బీజేపీ కార్పొరేటర్లు రాచకొండ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు.

Read More : Pegasus Row: కేంద్రంపై దీదీ ఫైర్.. నా ఫోన్ టాపింగ్ చేశారు.. అందుకే ప్లాస్టర్ వేశా!

ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని మంగ్లీపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. పాటలోని లిరిక్స్ మార్చేశారు మంగ్లీ. అసలు వివాదం ఎందుకు వచ్చింది. పాటలోని లిరిక్స్ ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయాలపై ఫేస్ బుక్ వేదికగా స్పందించారు మంగ్లీ. ఈ వివాదాలన్నింటికి తెర దించుతూ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు మంగ్లీ. లేటెస్ట్‌గా మంగ్లీ పాత పాటను డిలీట్‌ చేసి.. కొత్త లిరిక్స్‌తో మరో పాటను రిలీజ్‌ చేశారు. వివాదాస్పద లిరిక్స్‌ స్థానంలో కొత్త పదాలను చేర్చి విడుదల చేశారు.