Manike Mage Hithe: బెంగాలీలో మార్మోగుతున్న ‘దీదీ’ ‘మా మాతి మనుష్‌ హితే’ పాట!

‘మాణికే మాగే హితే’ పాట ఎంతగా ఊపేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. యూట్యూబ్ నుండి సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ ఫామ్స్ లో ఎక్కడ చూసినా ఇదే పాట కనిపిస్తుంది.

Manike Mage Hithe: ‘మాణికే మాగే హితే’ పాట ఎంతగా ఊపేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. యూట్యూబ్ నుండి సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ ఫామ్స్ లో ఎక్కడ చూసినా ఇదే పాట కనిపిస్తుంది. ఎక్కడో శ్రీలంకలో పుట్టిన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బాషలలో అనువాదంతో పాటు రీమిక్స్, డీజీ యాడ్ చేసి మోత మోగిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఈ పాటను రాజకీయాలలో కూడా వాడేసుకుంటున్నారు. తాజాగా బెంగాలీలో ‘మా మాతి మనుష్‌ హితే’ అనే పాటను విడుదల చేయగా ఈ పాట పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోసం రచించడం విశేషం.

Love Story: సెన్సిబుల్ లవ్‌స్టోరీ కోసం సిలబస్ మార్చేసిన శేఖర్ కమ్ముల

బెంగాల్‌లోని మేదినిపుర్‌కు చెందిన తండ్రీకూతుళ్లు ఈ పాటను రచించగా.. ఐదు రోజుల క్రితం విడుదల చేసిన ఈ గీతానికి ఇక్కడ మంచి ఆదరణ లభిస్తోంది. మమతా బెనర్జీ ప్రముఖ నినాదమైన ‘మా మాతి మనుష్’ ఆధారంగా మేదినిపుర్‌కు చెందిన వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త రాజేశ్‌ చక్రవర్తితోపాటు ఆయన కుమార్తె అపరాజిత ఈ పాటను రచించారు. మా మాతి మనుష్ అంటే తల్లి, మాతృభూమి, మనుషులు అని అర్ధం. ప్రజల అభివృద్ధి కోసం మమతా బెనర్జీ చేస్తున్న కృషి, చేపడుతున్న ప్రాజెక్టులు సహా అనేక విషయాలను ఈ పాటలో ప్రస్తావించారు.

Chiranjeevi: మెగాస్టార్ దూకుడు.. జెట్ స్పీడ్‌తో సినిమాలు షురూ!

బెంగాల్ లో దీదీ తెచ్చిన ‘లక్ష్మీర్ భండార్’, ‘స్వస్థ్య సతి’ వంటి పథకాల గురించి ప్రస్తావించగా.. దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యతలను సైతం దీదీ చేపట్టాలని ఈ పాటలో పేర్కొన్నారు. ఈ నెల 30న జరిగే భవానీపుర్‌ ఉప ఎన్నిక ముందు ఈ పాట విడుదల కావడం గమనార్హం కాగా ఇది ఒకరకంగా ఎన్నికల ప్రచారం కోసమేనని తెలుస్తుంది. బెంగాల్‌లో గత ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించినా.. నందిగ్రామ్‌ నుంచి పోటీచేసిన దీదీ ఓడిపోయారు. ఈసారి భవానీపుర్‌ నుంచి పోటీ చేసి గెలుపొందాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే దీదీ ముమ్మర ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు.

ట్రెండింగ్ వార్తలు