PS2 Movie: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న క్రేజీ సీక్వెల్ మూవీ.. మణిరత్నం స్ట్రాటెజీ మామూలుగా లేదుగా!

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్టాత్మక మూవీ పొన్నియిన్ సెల్వన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా హిస్టారికల్ మూవీని మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రెండు భాగాలుగా మణిరత్నం తెరకెక్కించగా, తొలి భాగం ఇప్పటికే సెన్సేషనల్ హిట్ అందుకుంది.

PS2 Movie: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న క్రేజీ సీక్వెల్ మూవీ.. మణిరత్నం స్ట్రాటెజీ మామూలుగా లేదుగా!

Maniratnam PS2 Movie Locks Release Date

PS2 Movie: తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్టాత్మక మూవీ పొన్నియిన్ సెల్వన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా హిస్టారికల్ మూవీని మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రెండు భాగాలుగా మణిరత్నం తెరకెక్కించగా, తొలి భాగం ఇప్పటికే సెన్సేషనల్ హిట్ అందుకుంది.

Ponniyin Selvan 2: సెన్సేషనల్ అప్డేట్.. పొన్నియిన్ సెల్వన్ పార్ట్-2 రిలీజ్ డేట్ ఇదే!

దీంతో ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలోనే ఈ భాగానికి సంబంధించిన షూటింగ్ పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో మణిరత్నం అండ్ టీమ్ బిజీగా ఉన్నారు. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే న్యూస్‌ను అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

ఈ అనౌన్స్‌మెంట్‌తో కోలీవుడ్ ప్రేక్షకుల్లో మరోసారి ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ రెండో పార్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి సమ్మర్ కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మణిరత్నం కెరీర్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.