Navarasa: నవరస ట్రైలర్.. హైప్ పెంచే పనిలో మణిరత్నం!

గతంలో స్టార్ ఫిల్మ్ మేకర్స్, బడా క్యాస్టింగ్ ఉన్న సినిమాలైతే భారీ హైప్ దక్కేది. కానీ ఇప్పుడు కాలం మారింది. మంచి సబ్జెక్ట్ ఉన్న షార్ట్ ఫిల్మ్ చాలు హైప్ దానంతట అదే వస్తుంది. కరోనా తర్వాత వెబ్ సిరీస్ ల మీద ప్రేక్షకులు ప్రత్యేక దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే.

10TV Telugu News

Navarasa: గతంలో స్టార్ ఫిల్మ్ మేకర్స్, బడా క్యాస్టింగ్ ఉన్న సినిమాలైతే భారీ హైప్ దక్కేది. కానీ ఇప్పుడు కాలం మారింది. మంచి సబ్జెక్ట్ ఉన్న షార్ట్ ఫిల్మ్ చాలు హైప్ దానంతట అదే వస్తుంది. కరోనా తర్వాత వెబ్ సిరీస్ ల మీద ప్రేక్షకులు ప్రత్యేక దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. అందుకే మేకర్స్ కూడా ప్రేక్షకుల మెస్మరైజ్ చేసే కంటెంట్ సిద్ధం చేస్తున్నారు. అలాంటి మెస్మరైజింగ్ కంటెంట్ తో వస్తుందే నవరస వెబ్ వెబ్ సిరీస్.

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం క్రియేషన్ లో వస్తున్న అంథాలజి నవరస సిరీర్. ఈ వెబ్ సినిమాలో మణిరత్నం నవరసాలు ఉండేలా ప్లాన్ చేశారు. పదిమంది దర్శకులు, మొత్తం తొమ్మిది ఎపిసొడ్లతో తెరకెక్కించిన ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన వీడియోలు, పాటలు, పోస్టర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుందా అని ఫిల్మ్ మేకర్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

నవరస నెట్ ఫ్లిక్స్ ద్వారా ఆగస్ట్ 6 వ తేదీ నుండి ప్రసారం కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు నెలకొనగా.. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ వారం చివరిలో ఈ ట్రైలర్ ను విడుదల చేసే అవకాశం ఉండగా.. ఇప్పటికే ఈ ట్రైలర్ కట్స్ పై మణిరత్నం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. దక్షణాది అన్ని బాషలలో విడుదల కానున్న ఈసినిమాలో దాదాపుగా అన్ని బాషల నుండి నటీనటులున్నారు.

10TV Telugu News