Manisharma : మణిశర్మ తనయుడి నిశ్చితార్థం ప్రముఖ సింగర్ తో..

ఈ యువ దర్శకుడు ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మహతి స్వర సాగర్ కి నిన్న గాయని సంజన కలమంజతో నిశ్చితార్ధం జరిగింది. ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది.

Manisharma :  మణిశర్మ తనయుడి నిశ్చితార్థం ప్రముఖ సింగర్ తో..

Mahathi

Manisharma :  మెలోడీ బ్రహ్మ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. `ఛలో`, `భీష్మ`, `మాస్ట్రో` లాంటి సూపర్ హిట్ చిత్రాలకు సరికొత్త సంగీతం అందించి యువ సంగత దర్శకుడిగా తండ్రికి తగ్గ తనయుడు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ యువ దర్శకుడు ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

మహతి స్వర సాగర్ కి నిన్న గాయని సంజన కలమంజతో నిశ్చితార్ధం జరిగింది. ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాగర్ పెళ్లాడే అమ్మాయి గాయని కావడం విశేషం.

Balakrishna : సినీ కుటుంబాల మధ్య కలతల్ని చెరిపేయబోతున్న బాలకృష్ణ, అల్లు అరవింద్

సంజనా కలమంజే తెలుగు, తమిళ్, మలయాళ చిత్రాల్లో పాటలు పాడారు. మూడు భాషల్లోనూ సింగర్ గా స్థానం సంపాదించుకున్నారు. సాగర్ సంగీతం అందించిన భీష్మ లో `హేయ్ చూసా` అనే పాటను సంజననే ఆలపించింది. వీరిద్దరికి అంతకుముందు నుంచే స్నేహం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ప్రేమ వివాహమా? కాదా? అనేది క్లారిటీ ఇవ్వలేదు ఈ సంగీత కుటుంబం. త్వరలోనే పెళ్లి జరగబోతుందని సమాచారం.