South Movies: బాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న సౌత్.. మనోజ్ బాజ్‌పేయి కామెంట్స్!

సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమా వస్తుందంటే బాలీవుడ్ కి వెన్నులో వణుకు పుడుతోంది. జస్ట్ సౌత్ సినిమా ఏం చేస్తుందని కొందరు మీడియా ముందు ఫోజులు కొట్టినా.. చివరికొచ్చేసరికి సౌత్ సినిమాల సక్సెస్ చూసి నోరెళ్ళ బెడుతున్నారు.

South Movies: బాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న సౌత్.. మనోజ్ బాజ్‌పేయి కామెంట్స్!

South Movies

South Movies: సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమా వస్తుందంటే బాలీవుడ్ కి వెన్నులో వణుకు పుడుతోంది. జస్ట్ సౌత్ సినిమా ఏం చేస్తుందని కొందరు మీడియా ముందు ఫోజులు కొట్టినా.. చివరికొచ్చేసరికి సౌత్ సినిమాల సక్సెస్ చూసి నోరెళ్ళ బెడుతున్నారు. దక్షణాది సినిమాల కలెక్షన్లు చూసి వణికిపోతున్నారు. బాలీవుడ్ లో సౌత్ సినిమాల హవా గురించి ఇప్పటికే చాలామంది బాలీవుడ్ ప్రముఖులు కామెంట్స్ చేయగా.. తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పేయి కూడా సౌత్ సినిమాలను ప్రశంసిస్తూ.. బాలీవుడ్ కి చురకలంటించారు.

South Movies: హిందీలో సౌత్ సినిమాల రికార్డులు.. నోరుపారేసుకుంటున్న బాలీవుడ్ క్రిటిక్స్!

దక్షిణాది చిత్రాల విజయానికి బాలీవుడ్ చిత్ర నిర్మాతలు భయపడుతున్నారని.. ఒకవిధంగా బాలీవుడ్ మేకర్స్ వెన్నులో వణుకు పుడుతుందని ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్‌పేయి కామెంట్స్ చేశారు. కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్, పుష్ప: ది రైజ్ వంటి చిత్రాల విజయం బాలీవుడ్ చిత్రనిర్మాతలకు వెన్నులో వణుకు పుడుతుందని మనోజ్ పేర్కొన్నారు. ఈ సినిమాలు బాలీవుడ్ సినిమాలను మించి విజయాన్ని సాధించే అంశాల గురించి మనోజ్ విశ్లేషించారు.

South Movies: బాలీవుడ్‌ను వెంటాడుతున్న సౌత్.. సైడ్ ఇచ్చేస్తున్న బీటౌన్!

కరోనా పాండమిక్ అనంతరం అల్లు అర్జున్ తెలుగు చిత్రం పుష్ప: ది రైజ్ హిందీ బెల్ట్‌లో ఆధిపత్యం చెలాయించే దక్షిణాది చిత్రాల ట్రెండ్‌ను ప్రారంభించి హిందీ-డబ్బింగ్ వెర్షన్ రూ.106 కోట్లు వసూలు చేస్తే.. క్రేజీ మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.. కన్నడ నుండి వచ్చిన పాన్ ఇండియా క్రేజీ మూవీ కేజీఎఫ్ 2 కొత్త పుంతలు ఒక్కొక్కటి హిందీలో రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి ఇప్పటికీ థియేటర్లలో నడుస్తున్నాయి. ఇది బాలీవుడ్‌లోని చాలా మందిని కలవరపెట్టిందని .. దీనిని ఎలా చూడాలో కూడా బాలీవుడ్ మేకర్స్ కు అంతుబట్టడం లేదని మనోజ్ మాట్లాడారు.

South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

సూర్యవంశీ వంటి పెద్ద బడ్జెట్ హిందీ సినిమాలు దేశం మొత్తం మీద రూ.200 కోట్లకు చేరుకోవడానికి కష్టపడుతున్నప్పుడు, హిందీలో డబ్ చేయబడిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 3 ఎలా రూ.300 కోట్లకు పైగా వసూలు చేశాయో మనోజ్ వివరంగా మాట్లాడాడు. ఈ సినిమాల విజయం బాలీవుడ్‌కు ఒక పాఠం అని, వారు త్వరగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సౌత్ సినిమాలు ఉద్వేగభరితంగా.. ప్రపంచంలోనే అత్యుత్తమ షాట్స్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయని.. ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో పల్స్ పట్టుకొని.. దానిని సినిమాగా మార్చడంలో సక్సెస్ అవుతున్నారని మనోజ్ ప్రశంసించారు.

Action Movies: యాక్షన్ ఫార్ములా.. వయొలెన్స్ కావాలంటోన్న టాప్ స్టార్స్!

ఫైనల్ గా ప్రేక్షకులకు వారు కోరుకున్నది చూపించేలా రావడంతోనే పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఈ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని.. ప్రతి ఫ్రేమ్‌ని వాస్తవంగా, ఒక జీవన్మరణ పరిస్థితిగా చిత్రీకరించారని చెప్పారు. మెయిన్ స్ట్రీమ్ సినిమా అంటే కేవలం డబ్బు, బాక్సాఫీస్ పరంగానే సౌత్ మేకర్స్ ఆలోచించడం మొదలుపెట్టారని.. అలా మనల్ని మనం విమర్శించుకోలేం కానీ.. బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాను ఎలా నిర్మించాలో హిందీ నిర్మాతలకు ఇది ఒక పాఠం అని చెప్పుకోవాలన్నారు.