Manoj Bajpayee : RGV నన్ను హీరోని చేస్తానని నమ్మించి.. ఆ తర్వాత.. మనోజ్ బాజ్‌పేయ్ సంచలన వ్యాఖ్యలు..

RGV కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సత్య సినిమాలో మనోజ్ బాజ్‌పేయ్ ముఖ్య పాత్ర చేసిన సంగతి తెలిసిందే. సెకండ్ లీడ్ లో భికూ మాత్రేగా మనోజ్ బాజ్‌పేయ్ చేసిన క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది. తాజాగా మనోజ్ బాజ్‌పేయ్ RGV గురించి, సత్య సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Manoj Bajpayee : RGV నన్ను హీరోని చేస్తానని నమ్మించి.. ఆ తర్వాత.. మనోజ్ బాజ్‌పేయ్ సంచలన వ్యాఖ్యలు..

Manoj Bajpayee sensational comments on RGV Regarding Satya movie

RGV : బాలీవుడ్(Bollywood) స్టార్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్(Manoj Bajpayee) హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి అభిమానులని సంపాదించుకొని బాలీవుడ్ లో ఎదిగాడు. ఇటీవల కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టు అటు సినిమాలతోను, ఇటు సిరీస్ లతోను చెలరేగిపోతున్నారు మనోజ్ బాజ్‌పేయ్. అయితే మనోజ్ బాజ్‌పేయ్ కి కెరీర్ ఇచ్చింది మాత్రం RGVనే. RGV హిందీలో తీసిన చాలా సినిమాల్లో మనోజ్ బాజ్‌పేయ్ ఉంటాడు.

RGV కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సత్య సినిమాలో మనోజ్ బాజ్‌పేయ్ ముఖ్య పాత్ర చేసిన సంగతి తెలిసిందే. సెకండ్ లీడ్ లో భికూ మాత్రేగా మనోజ్ బాజ్‌పేయ్ చేసిన క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది. ఆ సినిమా తర్వాతే మనోజ్ స్టార్ అయ్యాడు, మరిన్ని అవకాశాలు వచ్చాయి. RGV దర్శకత్వంలో మనోజ్ కి అదే మొదటి సినిమా. ఆ తర్వాత వీరి కాంబోలో అనేక సినిమాలు వచ్చాయి.

తాజాగా మనోజ్ బాజ్‌పేయ్ RGV గురించి, సత్య సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మనోజ్ బాజ్‌పేయ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దౌడ్ సినిమాలో ఓ నటుడి కోసం వెతుకుతున్నానంటే వెళ్లి మొదటిసారి RGVని కలిశాను. నేను బాండిట్ క్వీన్ లో మాన్ సింగ్ పాత్ర చేశాను అని చెప్పడంతో, ఇన్నాళ్లు నీ గురించే వెతుకుతున్నాను, ఆ సినిమా చాలా సార్లు చూశాను, ఆ పాత్ర నాకు బాగా నచ్చిందని. నీకు దౌడ్ సినిమాలో ఛాన్స్ వద్దు. నెక్స్ట్ నీ కోసమే ఓ స్క్రిప్ట్ రాశాను, అందులో నువ్వే మెయిన్ లీడ్ అని చెప్పారు. ఆ తర్వాత సత్య సినిమా కోసం కాల్ వస్తే మళ్ళీ వెళ్లి ఆర్జీవిని కలిశాను. కానీ అందులో రెండో పాత్ర కోసం నన్ను తీసుకుంటున్నాని చెప్తే నేను చాలా బాధపడ్డాను. నన్ను మెయిన్ లీడ్ అన్నారు కదా అని అడిగితే, భికూ మాత్రే పాత్ర గురించి నాకు చెప్పి ఓకే చెప్పేలా చేశారు. లీడ్ క్యారెక్టర్ లో ఎవరైనా చేయగలరు, కానీ భికూ మాత్రే నీకు మాత్రమే సాధ్యమవుతుంది అన్నారు. అప్పుడు మొదట బాధపడ్డా, సినిమా రిలీజ్ అయ్యాక భికూ మాత్రే పాత్రకు వచ్చిన స్పందన చూసి సంతోషం వేసింది అని తెలిపారు.

Bandla Ganesh : ఎన్టీఆర్‌ కూడా నా దేవరనే.. దేవర టైటిల్ వివాదం.. బండ్లగణేష్ ని ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..

ఆర్జీవీ సత్య సినిమా హిట్ అయినా అందులో హీరో కంటే కూడా మనోజ్ వేసిన భికూ మాత్రే పాత్ర బాగా పాపులర్ అయింది. ఆ పాత్రలో మనోజ్ అందర్నీ ఆకట్టుకున్నాడు.