మంచు మనోజ్ పాన్ ఇండియా మూవీ ‘అహం బ్రహ్మాస్మి’..

మంచు మనోజ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘అహం బ్రహ్మాస్మి’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది..

  • Published By: sekhar ,Published On : March 4, 2020 / 01:09 PM IST
మంచు మనోజ్ పాన్ ఇండియా మూవీ ‘అహం బ్రహ్మాస్మి’..

మంచు మనోజ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘అహం బ్రహ్మాస్మి’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది..

చిన్న విరామం తర్వాత మంచు మనోజ్ కొత్త సినిమా ప్రారంభించాడు. ఈసారి ఎమ్ఎమ్ ఆర్ట్స్ పేరుతో బ్యానర్ స్థాపించి నిర్మాతగా కూడా మారాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పణలో మనోజ్ నిర్మిస్తున్న సినిమా.. ‘అహం బ్రహ్మాస్మి’.. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోయే ఈ చిత్రం మార్చి 6న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కానుంది.

బుధవారం సాయంత్రం ‘అహం బ్రహ్మాస్మి’.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో శివభక్తుని తరహాలో మంచు మనోజ్ మూడు అడ్డ విభూది నామాలు, వాటి మధ్యలో నిలువు తిలకం దిద్దుకొని కనిపిస్తున్నారు. ‘వాన్ డైక్’ తరహా గడ్డం, పొడవుగా పెంచిన మీసకట్టుతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు.

పోస్టర్లో మనోజ్ మూడు రకాల హావభావాలు.. హాస్యం, రౌద్రం, శాంతం.. ప్రదర్శిస్తున్నారు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్‌కు అద్దం పట్టే విధంగా ఆ లుక్స్ ఉన్నాయి. టైటిల్ డిజైనింగ్ బాగుంది. వైవిధ్యభరితమైన ఈ కథను చాలా గ్రాండియర్‌గా తెరకెక్కించనున్నారు. 

అడిషనల్ డైలాగ్స్: దివ్య నారాయణన్, కల్యాణ్ చక్రవర్తి
పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్
సంగీతం: అచ్చు రాజమణి, రమేష్ తమిళమణి
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి
ఎడిటింగ్: తమ్మిరాజు
ఆర్ట్: వివేక్ ఎ.ఎం.
స్టంట్స్: పీటర్ హేన్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ చల్లగుళ్ల
నిర్మాతలు: నిర్మలాదేవి మంచు, మనోజ్ కుమార్ మంచు
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: శ్రీకాంత్ ఎన్. రెడ్డి.
 

Manoj Manchu's Aham Brahmasmi first look