Movie Releases: సినిమా సీజన్‌గా మార్చి నెల.. అన్నీ క్రేజీ సినిమాలే!

కోవిడ్ ప్రభావం మాగ్జిమమ్ తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు, సినిమా రంగం కూడా స్పీడప్ అయ్యింది. వరసగా భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. భారీ కలెక్షన్స్..

Movie Releases: సినిమా సీజన్‌గా మార్చి నెల.. అన్నీ క్రేజీ సినిమాలే!

Movie Release

Movie Releases: కోవిడ్ ప్రభావం మాగ్జిమమ్ తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు, సినిమా రంగం కూడా స్పీడప్ అయ్యింది. వరసగా భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫాన్స్ కు సమ్మర్ సీజన్ సినిమా సీజన్ గా టర్న్ అయ్యింది. సో మార్చి నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలేంటో డీటెయిల్డ్ గా చూద్దాం.

OTT Releases: థియేటర్‌లో స్టార్ మూవీస్.. అయినా తగ్గని ఓటీటీలు!

వరల్డ్ వైడ్ గా ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న రాధేశ్యామ్, ట్రిబుల్ ఆర్ కూడా మార్చి నెలలోనే డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. దాంతో మార్చి నెలకోసం ఫాన్స్ చాలా క్యూరియస్ గా చూస్తున్నారు. మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న శర్వానంద్ హోప్స్ పెట్టుకున్నసినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు మార్చి 4న శుక్రవారం నుంచి థియేటర్లో సందడి చేయనుంది. అదే రోజు కిరణ్ అబ్బవరం, నువేక్షా అండ్ కోమలి ప్రసాద్ నటిస్తున్న సెబాస్టియన్ పిసి 524 సినిమా కూడా రిలీజ్ కానుంది. ఒకే రోజు రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.

Movie Releases: ఈ వారం ధియేటర్లో ఎంటర్‌టైన్మెంట్ మోత!

కోలీవుడ్ స్టార్ సూర్యకు తమిళనాడులోనే కాదు, తెలుగులోనూ ఫాన్స్ ఉన్నారు. సూర్య నుంచి వచ్చిన సినిమాలు ఇక్కడ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. రీసెంట్ గా ఆకాశమే హద్దురా, జై భీమ్ తర్వాత సూర్య నుంచి వస్తోన్న ఈటి ఎవరికీ తలవంచడు సినిమా మార్చి 10న రిలీజ్ కానుంది. ఒక రోజు గ్యాప్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ కూడా మార్చి 11న వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్తాయిలో రిలీజ్ కానుంది. సాహో తర్వాత చాలా టైమ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. సో సౌత్ ఇండియాలో సూర్య, ప్రభాస్ మధ్య పోటీ కూడా రసవత్తరంగానే ఉండనుంది.

OTT Releases: థియేటర్‌లో స్టార్ మూవీస్.. అయినా తగ్గని ఓటీటీలు!

మార్చి లాస్ట్ వీక్ లో వరల్డ్ వైడ్ ఫాన్స్, మేకర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ కానుంది. మార్చి 25న డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో రాబోతుంది. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ మార్చి ఫస్ట్ వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు జక్కన్న టీమ్. మాస్ రాజ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా టీమ్ కూడా మార్చి 25 లేదా ఏప్రిల్ నెలలో తమ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మార్చి ఫస్ట్ న టీజర్ రిలీజ్ చేసి, త్వరలోనే రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయబోతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా మార్చి నెలలో సినీ ప్రియులకు బిగ్ ఫెస్టివల్ జరగనుంది.