Maro Prasthanam: మరో ప్రస్థానం నాకో ఛాలెంజ్ సినిమా.. హీరోయిన్ ముస్కాన్ సేథి!

నాలుగు ఫైట్లు, ఆరు పాటలు.. హీరోయిన్స్ వెంట తిరిగే హీరోలు.. ఒకప్పుడు ఇలా సాగే తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పంథాలో వెళ్తుంది. షార్ట్ ఫిల్మ్స్ తీసి సిల్వర్ స్క్రీన్ మీద తన టాలెంట్..

Maro Prasthanam: మరో ప్రస్థానం నాకో ఛాలెంజ్ సినిమా.. హీరోయిన్ ముస్కాన్ సేథి!

Maro Prasthanam

Maro Prasthanam: నాలుగు ఫైట్లు, ఆరు పాటలు.. హీరోయిన్స్ వెంట తిరిగే హీరోలు.. ఒకప్పుడు ఇలా సాగే తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పంథాలో వెళ్తుంది. షార్ట్ ఫిల్మ్స్ తీసి సిల్వర్ స్క్రీన్ మీద తన టాలెంట్ చూపించుకోవాలని తపన పడే మేకర్స్ నుండి బడా బడా నిర్మాణ సంస్థలు కూడా ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి.. అందులో కొత్తదనం ఏంటి అని లెక్కలేసుకుంటున్నారు. అందుకే మన సినిమాలో కూడా కొత్త కొత్త జోనర్స్, ప్రయోగాలతో సినిమాలు వస్తున్నాయి. అలా ప్రయోగంగా వస్తున్న సినిమా మరో ప్రస్థానం.

Bigg Boss 5: వారానికి సరయూ అందుకున్న పారితోషకం ఇదే?

ఈ సినిమాలో కథ ఎంత టైమ్ జరిగితే సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్, జర్క్స్, రివైండ్ షాట్స్ లేకుండా స్ట్రైట్ స్క్రీన్ ప్లే తో మరో ప్రస్థానం చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు జాని తెలిపాడు. ఈ సినిమా ఓ ఎమోషనల్ కిల్లర్ జర్నీ అని ధీమాగా ఈ సినిమా మేకర్స్ ధీమా ఉన్నారు. కథ, కథనం సరికొత్తగా ఉంటుందని.. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఉత్కంఠతో చూసేలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించామని చెప్పారు.

Horror Movies: బంపర్ అఫర్.. ఈ హార్ర‌ర్ సినిమాలు చూస్తే రూ.ల‌క్ష పారితోష‌కం!

కొద్దిరోజులుగా తనకు బ్రేక్ ఇచ్చే సినిమా కోసం చూస్తున్న యంగ్ హీరో తనీష్ నటిస్తున్న ఈ సినిమాలో పైసా వసూల్, ‘రాగల 24 గంటల్లో’ సినిమాలతో నటించిన ముస్కాన్ సేథి హీరోయిన్. తెలుగుతో పాటు బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లో నటించిన ముస్కాన్ ‘మరో ప్రస్థానం’ లాంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రయోగానికి సిద్ధపడడం విశేషం కాగా జానీ ఈ సినిమాని తెరకెక్కించాడు. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించగా.. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది.

Big Boss 5: సవాళ్లు.. మధ్యలో నానాబూతులు.. ఇది నిజంగా ‘మండే’నే!

ఈ నెల 24న మరో ప్రస్థానం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సందర్భంగా మాట్లాడిన.. హీరోయిన్ ముస్కాన్ సేథి.. మరో ప్రస్థానం మూవీ నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ. ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్. ఇందులో యాక్షన్ సీన్స్ లో నటించడం కొత్తగా ఉండగా.. ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఈ కథ గురించి చెప్పిన ముస్కాన్.. ఇదోక రఫ్ అండ్ రగ్గడ్ ఫిల్మ్. ఇది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటూ కథ అంతా ఒక రోజులోనే జరుగుతుంది. ప్రతి సీన్ చాలా రియలిస్టిటిక్ గా ఉంటూ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పింది. ఖచ్చితంగా ఆడియన్స్ కి మరో ప్రస్థానం నచ్చుతుందని ఆశిస్తూ.. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పారు.