Prabhas: ప్రభాస్ కోసం మారుతి అవి బాగా యాడ్ చేస్తున్నాడట..!

దర్శకుడు మారతి డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కామెడీని పుష్కలంగా యాడ్ చేస్తున్నాడట దర్శకుడు మారుతి.

Prabhas: ప్రభాస్ కోసం మారుతి అవి బాగా యాడ్ చేస్తున్నాడట..!

Maruthi Adding Fun Elements For Prabhas Movie

Maruthi Prabhas Film: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ మూవీని రిలీజ్ కు రెడీ చేసిన ప్రభాస్, తన నెక్ట్స్ మూవీ ‘సలార్’ని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా ముగింపు దశకు చేరుకోవడంతో అభిమానులు ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.

Prabhas : ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రభాస్..

ఇక ఈ సినిమాలతో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్‌లోనూ ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ సినిమాలో హార్రర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ చెబుతోండగా, ఈ సినిమాలో కామెడీని పుష్కలంగా యాడ్ చేస్తున్నాడట దర్శకుడు మారుతి.

Prabhas : ప్రభాస్, మారుతీ సినిమా నుంచి ఫోటో లీక్.. గుబురు గడ్డంతో ప్రభాస్ డిఫరెంట్ లుక్!

ఇప్పటికే పూర్తి ఎంటర్‌టైనింగ్ మూవీగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్న మారుతి, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ చేయని విధంగా కామెడీ పండించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు ఖచ్చితంగా వావ్ అనాల్సిందేనట.