Rajamouli : మార్వెల్ స్టూడియోస్‌కు రాజమౌళి క్లాస్.. ఎలా వాడాలో చెప్పాలట!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళిని మార్వెల్ స్టూడియోస్‌కు క్లాస్ తీసుకోవాలంటూ ఇంటర్వ్యూయర్ అన్న మాటలు వైరల్ గా మారిని.

Rajamouli : మార్వెల్ స్టూడియోస్‌కు రాజమౌళి క్లాస్.. ఎలా వాడాలో చెప్పాలట!

marvel studios need rajamouli class on vfx work

Rajamouli : ఆర్‌ఆర్‌ఆర్.. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం, అలాగే టాలీవుడ్ లోని ఇద్దరు టాలెంటెడ్ స్టార్ హీరోస్ ఈ సినిమాలో నటించడంతో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కి ముందే భారీ హైప్ ని క్రియేట్ చేసుకుంది. ఇక విడుదల తరువాత మూవీ చూసిన ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. కేవలం భారతదేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీకి ఫిదా అయ్యిపోయారు.

Rajmouli-Mahesh Movie: రియల్ లైఫ్ స్టోరీతో మహేష్-రాజమౌళి సినిమా.. విజయేంద్రప్రసాద్!

ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డుల బరిలో కూడా నిలవగా, సినిమా కాంపెయిన్ చేస్తూ దర్శకుడు రాజమౌళి అమెరికాలోని అనేక నాగరాలను చుట్టేస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడి మీడియాతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళిని మార్వెల్ స్టూడియోస్‌కు క్లాస్ తీసుకోవాలంటూ ఇంటర్వ్యూయర్ అన్న మాటలు వైరల్ గా మారిని.

అయితే విషయం ఏంటంటే.. మీరు VFX ని హేండిల్ చేసే పద్ధతి ఏంటని? ప్రశ్నించగా, దానికి రాజమౌళి.. “నాకు VFX అనేది స్టోరీటెల్లింగ్ లో వన్ అఫ్ ది టూల్” అని బదులిచ్చాడు. అప్పుడు ఆ ఇంటర్వ్యూయర్ మీ VFX హ్యాండ్లింగ్ ని మార్వెల్ కి కూడా నేర్పించాలి అన్నాడు. అయితే అతని ఉద్దేశం VFX అనేది స్టోరీలోని ఎమోషన్స్ ని మరింతగా చూపించడమే కానీ, స్టోరీకి హంగులు అద్దడం కాదు. ఎందుకంటే ఇప్పటి మర్వెల్ మూవీస్ లో స్టోరీ ఉండడం లేదు గ్రాఫిక్స్ తో సినిమాలను రాణించేస్తున్నారు.