Masooda: ఓటీటీలో రఫ్ఫాడిస్తున్న మసూద.. 100 మిలియన్ నిమిషాల పాటు భయపెడుతూనే ఉందట!

టాలీవుడ్‌లో హార్రర్ మూవీగా వచ్చిన ‘మసూద’ బాక్సాఫీస్ వద్ద సైలెంట్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలాకాలం తరువాత తెలుగు ప్రేక్షకులను థియేటర్స్‌లో భయపడేలా చేసింది ఈ ‘మసూద’ మూవీ. దర్శకుడు సాయి కిరణ్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాగా, ఈ సినిమాను చూసేందుకు రిపీటెడ్ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చారు. ఇక ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ బాగా హెల్ప్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

Masooda: ఓటీటీలో రఫ్ఫాడిస్తున్న మసూద.. 100 మిలియన్ నిమిషాల పాటు భయపెడుతూనే ఉందట!

Masooda Creates Rage In AHA OTT

Masooda: టాలీవుడ్‌లో హార్రర్ మూవీగా వచ్చిన ‘మసూద’ బాక్సాఫీస్ వద్ద సైలెంట్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలాకాలం తరువాత తెలుగు ప్రేక్షకులను థియేటర్స్‌లో భయపడేలా చేసింది ఈ ‘మసూద’ మూవీ. దర్శకుడు సాయి కిరణ్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాగా, ఈ సినిమాను చూసేందుకు రిపీటెడ్ ఆడియెన్స్ థియేటర్లకు వచ్చారు. ఇక ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ బాగా హెల్ప్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

Masooda: భయపెట్టేందుకు ఓటీటీలోకి వస్తున్న మసూద..?

ఈ హార్రర్ డ్రామా మూవీని ఇప్పటికే ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ చేస్తుండగా, ఇప్పుడు అందులోనూ ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను డిసెంబర్ 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయగా, ఇప్పటివరకు ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ నిమిషాల స్ట్రీమింగ్‌ను పూర్తి చేసుకున్నట్లుగా ఆహా ప్రకటించింది. ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకులు కూడా పదేపదే చూస్తుండటంతో ఈ సినిమా వారికి తెగ నచ్చేసిందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మసూద అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వచ్చిన ఈ హార్రర్ మూవీలో సంగీత, తిరువీర్, బాంధవి శ్రీధర్, కావ్య కల్యాణ్ రామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించగా, స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది.