Masooda Movie: సైలెంట్ హిట్‌గా దూసుకుపోతున్న ‘మసూద’.. ఆగనంటోందిగా!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన లేటెస్ట్ హార్రర్ మూవీ ‘మసూద’ మంచి టాక్ తో సైలెంట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమా వసూళ్ల పరంగా తొలి వారాంతం కంటే కూడా రెండో వారాంతంలో ఎక్కువ కలెక్ట్ చేయడం, ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుంది అనే దానికి ఉదాహరణగా నిలుస్తోంది.

Masooda Movie: సైలెంట్ హిట్‌గా దూసుకుపోతున్న ‘మసూద’.. ఆగనంటోందిగా!

Masooda Movie Showing Rampage At Box Office

Masooda Movie: టాలీవుడ్‌లో హార్రర్ సినిమాలకు కాలం చెల్లిపోయిందని.. దర్శకనిర్మాతలు ఆ జోనర్ సినిమాలను టచ్ చేయడమే మానేశారు. ఏదైనా హార్రర్ కామెడీ సబ్జెక్టులు బాగుంటేనే వాటిని తెరకెక్కించేందుకు వారు ముందుకు వస్తున్నారు. అయితే ఇతర ఇండస్ట్రీల్లో మాత్రం హార్రర్ జోనర్ సినిమాలకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుండటం విశేషం. దీంతో టాలీవుడ్‌లోనూ తాజాగా ‘మసూద’ అనే హార్రర్ మూవీని రిలీజ్ చేశారు.

Masooda Teaser : భయపెడుతున్న ‘మాసూద’ టీజర్.. నాని చేతుల మీదుగా రిలీజ్..

దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించిన ఈ హార్రర్ డ్రామా మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్‌రామ్‌ల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. అంతేగాక, చాలా రోజుల తరువాత ఓ మంచి హార్రర్ మూవీ వచ్చిందని ఆడియెన్స్ భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు ప్రేక్షకాదారణ రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈ సినిమాకు తొలి వారంలో పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ మరింత ఆసక్తిని చూపుతుండటంతో రెండో వారాంతంలో ఈ సినిమా వసూళ్లు ఊహించని విధంగా పెరిగాయి.

రెండో వారాంతం కలెక్షన్లు మొదటి వారాంతం వసూళ్లకంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఈ సినిమాలో శుభలేక సుధాకర్, అఖిలా రామ్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఇక మసూద సినిమాను రాహుల్ యాదవ్ ప్రొడ్యూస్ చేశారు.