Masooda: రేపు భయపడేందుకు సిద్ధంగా ఉండండి.. మసూద వచ్చేస్తోంది!

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన హార్రర్ మూవీ ‘మసూద’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది. అయితే ఈ సినిమాలోని హార్రర్ అంశాలు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో, ఈ సినిమా సర్‌ప్రైజ్ హిట్‌గా నిలిచింది.

Masooda: రేపు భయపడేందుకు సిద్ధంగా ఉండండి.. మసూద వచ్చేస్తోంది!

Masooda OTT Streaming Time Revealed

Masooda: టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన హార్రర్ మూవీ ‘మసూద’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది. అయితే ఈ సినిమాలోని హార్రర్ అంశాలు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో, ఈ సినిమా సర్‌ప్రైజ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు సాయి కిరణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించగా, స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

Masooda: భయపెట్టేందుకు ఓటీటీలోకి వస్తున్న మసూద..?

ఇక ఈ సినిమాలో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేక సుధాకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా, సినిమాలోని భయపెట్టే సీన్స్ ప్రేక్షకులను థియేటర్లలో వణికించేశాయి. వారు ఈ సినిమాను ఎంజాయ్ చేయడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ చేసింది. డిసెంబర్ 21న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. అయితే రెగ్యులర్‌గా సినిమాలను ఓటీటీలో అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ చేస్తారు.

Masooda Movie: సైలెంట్ హిట్‌గా దూసుకుపోతున్న ‘మసూద’.. ఆగనంటోందిగా!

కానీ, మసూద హార్రర్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాను రేపు రాత్రి 7 గంటల నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆహా ప్రకటించింది. ఇక రేపు రాత్రికాగానే భయపడేందుకు సిద్ధం కావాలంటూ మసూద అభిమానులను కోరుతోంది. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.