Telugu Movies: మాస్ ఆడియెన్స్ ఆదరణ లేదా.. రాధేశ్యామ్, ఆచార్య రిజల్టే!

మాస్ పల్స్ ను అర్థం చేసుకోవడంలో కొందరు డైరెక్టర్స్ విఫలమవుతున్నారు. కానీ ఆ మాస్ మ్యానియానే నిచ్చెన చేసుకొని కొందరు బాక్సాఫీన్ ను రూల్ చేస్తున్నారు.

Telugu Movies: మాస్ ఆడియెన్స్ ఆదరణ లేదా.. రాధేశ్యామ్, ఆచార్య రిజల్టే!

Telugu Movies

Telugu Movies: మాస్ పల్స్ ను అర్థం చేసుకోవడంలో కొందరు డైరెక్టర్స్ విఫలమవుతున్నారు. కానీ ఆ మాస్ మ్యానియానే నిచ్చెన చేసుకొని కొందరు బాక్సాఫీన్ ను రూల్ చేస్తున్నారు. ప్రజెంట్ మాస్ కంటెంట్ కు కరెక్ట్ గా కనెక్ట్ అవుతున్న హీరోలు హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. అలా అనీ క్లాసీగా సినిమా ఉంటే ఆడదనే ఆధారాలు కూడా ఏమీ లేవు. కానీ దమ్మున్న మాస్ కథకు ఆడియెన్స్ ఆదరణ తోడైతే ఆ ప్రాజెక్ట్ కమర్షియల్ లెక్కలు ఊదకందడం లేదు.

Telugu Movies: భారీ సినిమాల మధ్యలో ముద్దుగా వస్తున్న రొమాంటిక్ మూవీస్!

బాహుబలి, సాహో తర్వాత హై ఎండ్ యాక్షన్ ఎలిమెంట్స్, ఎక్స్ పెక్ట్ చేసినట్టు ఎలివేట్ చేసే సీన్స్ లేకపోవడంతోనే రాధేశ్యామ్ పట్టాలు తప్పింది. ప్రభాస్ కెరీర్ లో బిగ్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఆరడుగుల కటౌట్ అలా సాధాసీధాగా తిరిగేస్తుంటే ఫ్యాన్స్ ఎందుకో సింపుల్ గా చూసేందుకు ఇష్టపడలేదు. క్లాసీ లవర్ బాయ్ గా గ్లోబల్ స్టార్ ను ఊహించుకోలేకపోయారు. సో బిగ్ డిజాస్టర్స్ లిస్ట్ లో చేరేలా రాధేశ్యామ్ లీడ్ తీసుకుంది.

Telugu Movies: అన్ని ఎలిమెంట్స్ కాదు.. కొత్తగా కావాలంటున్న ప్రేక్షకులు!

సేమ్.. ఆచార్య విషయంలోనూ ఫ్యాన్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఆశలు.. అంచనాలు లెక్కతప్పాయి. ఇద్దరు స్టార్ హీరోలు.. అదీ మెగా తండ్రికొడుకులు కలిసి వస్తున్నారంటే మాస్ కా బాప్ అన్నట్టు సినిమా ఉండాలి. యాక్షన్ సీన్స్ తో చిరూ, చరణ్ రెచ్చిపోతుంటే ఫ్యాన్స్ ఊగిపోవాలి. హై బేస్ తో డైలాగ్స్ పలుకుతుంటే మాస్ ఆడియెన్స్ లో పూనకాలు రావాలి. కానీ అందులో కాస్త కూడా ఆచార్య రీచ్ కాలేదు. సో మెగా హీరోల కెరీర్ లో ఆచార్య ఓ మరకగా మిగిలింది.