Tollywood Movies: టాలీవుడ్‌ను ఊరిస్తున్న ఊరమాస్.. ముందుంది అసలైన మాస్ జాతర Mass in Tollywood Movies .. The original Mass Fair ahead

Tollywood Movies: టాలీవుడ్‌ను ఊరిస్తున్న ఊరమాస్.. ముందుంది అసలైన మాస్ జాతర

ఊర మాస్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను టాలీవుడ్ ఊరిస్తోంది. మాస్ జపం చేస్తూ స్టార్స్ సూపర్ హిట్ కొడుతున్నారు. మాస్ మ్యానరిజంతో అదరగొడుతున్న హీరోలకు కలెక్షన్ల పట్టం కడుతున్నారు ప్రేక్షకులు. ఇప్పుడదే కల్డ్ అండ్ కిక్ తో సెట్స్ పై చాలా సినిమాలే సందడి చేస్తున్నాయి.

Tollywood Movies: టాలీవుడ్‌ను ఊరిస్తున్న ఊరమాస్.. ముందుంది అసలైన మాస్ జాతర

Tollywood Movies: ఊర మాస్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను టాలీవుడ్ ఊరిస్తోంది. మాస్ జపం చేస్తూ స్టార్స్ సూపర్ హిట్ కొడుతున్నారు. మాస్ మ్యానరిజంతో అదరగొడుతున్న హీరోలకు కలెక్షన్ల పట్టం కడుతున్నారు ప్రేక్షకులు. ఇప్పుడదే కల్డ్ అండ్ కిక్ తో సెట్స్ పై చాలా సినిమాలే సందడి చేస్తున్నాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. మ మ మాస్ అంటూ హీరోలు యాక్షన్ కలరింగ్ ఇస్తుంటే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. సరైన కంటెంట్ కి తగ్గట్టు హీరోల మాసిజం ఎలివేట్ అయిందా.. బాక్సాఫీస్ బద్దవలడం గ్యారంటీ. ఇప్పుడిదే సూత్రాన్ని నమ్ముకుని సెట్స్ పైకి చాలా సినిమాలు వెళ్తున్నాయి. మాస్ గ్లూకోజ్ ఎక్కించి ఆడియెన్స్ కు కావాల్సినంత బూస్టప్ ఇస్తున్నారు డైరెక్టర్స్. ప్రేక్షకుల పల్స్ తెలుసుకుని మాస్ డోస్ లతో బాక్సాఫీస్ గల్లా నింపేస్తున్నారు. కరెక్ట్ కథకి.. కటౌట్ ఉన్న హీరో దొరికితే.. ఆ హీరోకి ఎక్జైటెడ్ ఎలివేషన్స్ యాడ్ అయితే కథ వేరుంటది బాసు అని తేల్చేస్తున్నారు.

Tollywood Movies: కుర్ర హీరోలకి కలిసొస్తున్న పెళ్లి కాన్సెప్ట్!

చిరూ, బాలయ్య లాంటి సీనియర్స్ సైతం మాస్ సినిమాలకే ఓటేస్తున్నారు. రీసెంట్ గా తారక్ బర్త్ డే సందర్భంగా రిలీజైన కొత్త సినిమాల పోస్టర్స్ చూస్తుంటే తారక్ రాబోవు సినిమాలు పక్క మాస్ అని తేలిపోతున్నాయి. కత్తి పట్టుకుని ఎన్టీఆర్ ఇచ్చిన లుక్ కొరటాల మూవీపై మాస్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాలోనూ తారక్ పవర్ఫుల్ రోల్ లోనే కనిపించబోతున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించాడు. ప్రశాంత్ నీల్ అంటేనే డార్క్ మాస్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. తన ఫస్ట్ మూవీ ఉగ్రం, కేజీఎఫ్1,2.. సలార్ ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ. అన్నీ బ్లాక్ మోడ్ లో మ మ మాస్ అనిపించేవే. అందులోనూ తారక్ కు మాస్ సినిమాలు బాగా కలిసొచ్చేవే. ఈ హీరోకు ప్రశాంత్ నీల్ తోడైతే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు ఫ్యాన్స్.

Tollywood Movies : డిజిటల్ రైట్స్ కోసం కోట్లు ఖర్చు..!

రాధేశ్యామ్ తో పొగొట్టుకున్న ఇమేజ్ ను సలార్ తో వడ్డీతో సహా రాబట్టుకోవాలనేది ప్రభాస్ ప్లాన్. కేజీఎఫ్ లాంటి బ్లాస్టింగ్ ఫ్రాంచైజ్ చూపించిన ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా నంబర్ 1 కటౌట్ ప్రభాస్ నటిస్తున్నారన్నప్పుడే అంచనాలు పెరిగాయి. ఇప్పుడు కేజీఎఫ్ 2 ఇంత బ్లాక్ బస్టర్ అయ్యాక ఆ అంచనాల రెట్టింపు అయ్యాయి. యశ్ నే బూస్టింగ్ ఎలివేషన్స్ లో మాస్టర్ గా చూపించిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కు డబుల్ డోస్ ఇస్తారని ఆశలు పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. అదే 100 పర్సెంట్ నిజమైతే సెంటర్ ఏదైనా మాస్ దేవుడిగా రెబల్ స్టార్ మారడం ఖాయం.

Tollywood Movies : దేశాలు దాటుతున్న సినిమాలు..

పుష్ప రిజల్ట్ కూడా పెద్ద పెద్ద తలకాయలకి షాక్ ఇచ్చేదే. తెలుగుకన్నా హిందీలో త్వరగా బ్రేక్ ఈవెన్ సాధించడం అదీ పెద్దగా ప్రమోషన్స్ లేకుండా అంటే మాస్ ఆడియెన్స్ ఎంత ఆకలితో ఉన్నారో అర్ధమవుతోంది. ఎప్పుడైతే జనాల మధ్య నుంచి క్యారెక్టర్స్ పుడతాయో అవి ఫిల్మ్ హిస్టరీలో నిలిచిపోతాయి. అలా వచ్చిన రాఖీభాయ్.. ఆ తర్వాత సుకుమార్ తీసుకొచ్చిన పుష్పరాజ్ అసలైన కమర్షియల్ లెక్కలు చూపించాయి. పుష్పరాజ్ గా బన్నీ మారిన తీరు జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే పుష్ప సీక్వెల్ ను మాస్ కా బాప్ అనేలా రెడీ చేయాలనుకుంటున్నారు సుకుమార్.

Tollywood Big Movies: ఎంత తోప్ సినిమా అయినా.. లెక్కలు తేల్చేది ప్రేక్షకులే!

అసలు మాస్ బాటలో నడిచే రాజమౌళి డైరెక్టర్లకు రాజయ్యాడు. సింహాద్రి, యమదొంగ, మగధీర, ఛత్రపతి, విక్రమార్కుడు లాంటి సినిమాలను చూస్తే రాజమౌళికి స్టార్ డం ఇచ్చింది మాస్ మ్యానియానే అని ఒప్పుకోకతప్పదు. బాహుబలి లాంటి సినిమా నేషనల్ బంపర్ సక్సెస్ సాధించిందంటే.. అందులోనూ మాస్ ఆడియెన్స్ తో విజిల్స్ వేయించే సీన్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తో కూడా అదే రిపీట్ చేయాలనుకున్న రాజమౌళి. కమర్షియల్ గా అందులో సక్సెస్ అయ్యాడు. ఇక, ఫారెస్ట్ అడ్వెంచరస్ గా మహేశ్ బాబుతో చేయబోతున్న సినిమాతో అంతకి మించి క్రేజ్ చూపించబోతున్నాడు. సూపర్ స్టార్ ను తనదైన మాస్ ఎలివేషన్స్ తో మాస్ అప్పీల్ తో ప్రెజెంట్ చేయనున్నాడు.

Young Heroes Movies: పాపం చిన్న హీరోలు.. రిలీజ్ డేట్ దొరకడమే కష్టమైందే!

లైగర్ కూడా మాస్ టచ్ ఇవ్వబోతుంది. లోకల్ ఛాయ్ వాలా ప్రపంచం మెచ్చే బాక్సర్ గా ఎలా ఎదిగాడనేది లైగర్ కథ. అసలే మాస్ మ్యానరిజమ్స్ తో మజాక్ చేసే పూరీ జగన్నాథ్.. ఆపై అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ. వీళ్లిద్దరూ కలిస్తే ముంబై మాత్రమే కాదు.. హోల్ ఇండియా ఆడియెన్స్ ని లైగర్ షేక్ చేయడం పక్కా అని తేల్చేస్తున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ తర్వాత మళ్లీ త్వరలో ఇంతటి మాస్ జాతర లైగర్ తోనే చూస్తామనే అంచనాలు కొందరిలో ఉన్నాయి.

Telugu Movies: మాస్ మంత్రాన్ని పలికేస్తున్న స్టార్ హీరోలు!

సాఫ్ట్ రూట్ మార్చి మాస్ ట్రాక్ ఎక్కాడు నాని. పుష్ప, కేజీఎఫ్ ను మిక్స్ చేసిన రా అండ్ టఫ్ లుక్ లో దసరా సినిమా చేస్తున్నాడు. కేజీఎఫ్ లాగా డార్క్ బ్యాక్ గ్రౌండ్.. పుష్పరాజ్ లా జుట్టు, గడ్డం, లుంగీ.. నాని మాస్ అవతార్ లో కొత్తగా ట్రై చేస్తున్నాడు. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో ఈ మాస్ సీజన్ లో మెరుపులా దసరా దూసుకుపోతుందనే అంచనాలు నానికున్నాయి. సాని కాయిదంలో రగ్డ్ లుక్ చూపించిన కీర్తి సురేశ్.. దసరాలోనూ డీగ్లామరస్ గానే కనిపించబోతుంది.

Flop Movies: భారీ నష్టాలను తెచ్చిన సినిమాలు.. ఫ్యాన్స్‌కు పీడ కల లాంటి డిజాస్టర్స్!

మాస్ యాంగిల్ చూపించాలనే ఆలోచన ఇప్పుడు టైర్ 2 హీరోలను కూడా వెంటాడుతోంది. నితిన్ మాచర్ల నియోజక వర్గంతో తనలోని మాస్ హీరోని బయటికి తెస్తా అంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి పక్కా మాస్ మూవీ తర్వాత.. ది వారియర్ తో మరోసారి రామ్ విశ్వరూపం చూపిస్తాడనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పోలీస్ గా కనిపిస్తూనే రామ్ మాస్ ప్రజెంటేషన్ ఆకట్టకుందనే ధీమాతో ఉన్నారు.

Upcoming Movies: సౌత్ సినిమాలపై దేశం చూపు.. ఆశలన్నీ ఈ సినిమాలపైనే!

ఊర మసాలా కమర్షియల్ కంటెంట్ తీసే దర్శకులు హిందీలో బొత్తిగా తగ్గిపోయారు. సల్మాన్ అక్షయ్ లు తప్ప అందరూ అర్బన్ డ్రామాల్లోనే కనిపిస్తున్నారు. అందుకే మాస్ ప్రేక్షకుల ఆకలిని మన సౌత్ దర్శకులు తీస్తున్నారు. సినిమా డబ్బింగా అనేది పట్టించుకోకుండా అక్కడి ఆడియన్స్ థియేటర్లకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. దక్షిణాది సినిమాల్లో యాక్షన్‌, డ్రామా, కామెడీ.. ఈ మూడు బాగా ఉంటున్నాయి. ఇవే మాస్‌ ప్రేక్షకులకు బాగా చేరువచేస్తున్నాయని అక్కడి స్టార్ మేకర్స్ ఒప్పుకుంటున్నారు. అలా టాలీవుడ్ ఇప్పుడీ ఊర మాస్ ఫార్ములాను ఫాలో అవుతోంది.

×