రవితేజ 66 – ‘క్రాక్’ ఫస్ట్‌లుక్

మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందనున్న సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల..

  • Published By: sekhar ,Published On : November 14, 2019 / 04:47 AM IST
రవితేజ 66 – ‘క్రాక్’ ఫస్ట్‌లుక్

మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందనున్న సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల..

‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాల తర్వాత మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందనున్న సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీకి ‘క్రాక్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

తీక్షణంగా చూస్తున్న రవితేజ లుక్ ఆకట్టుకుంటోంది. మీసం మెలితిప్పి, గెడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు మాస్ మహారాజ్.. టైటిల్ డిజైనింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నవంబర్ 14న ‘క్రాక్’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.

Read Also : ‘ఓ మైగాడ్ డాడీ’ – అల్లు అయాన్, అర్హల అల్లరి చూశారా!

రవితేజ సరసన శృతి హాసన్ కథానాయికగా నటించనుండగా.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. డైలాగ్స్ : సాయి మాధవ్ బుర్రా, మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రఫీ : జీకే విష్ణు, ఎడిటింగ్ : నవీన్ నూలి.