ఐ యామ్ ది రాజా.. డిస్కోరాజా

ఐ యామ్ ది రాజా.. డిస్కోరాజా

వినాయక చవితి సందర్భంగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడికల్ మూవీ 'డిస్కోరాజా' ఫస్ట్ లుక్ రిలీజ్..

ఐ యామ్ ది రాజా.. డిస్కోరాజా

వినాయక చవితి సందర్భంగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడికల్ మూవీ ‘డిస్కోరాజా’ ఫస్ట్ లుక్ రిలీజ్..

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా..   డిస్కోరాజా.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్‌.. ఎస్.ఆర్.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఢిల్లీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.

వినాయక చవితి సందర్భంగా డిస్కోరాజా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. స్టైలిష్‌గా సూట్ వేసుకుని, గాగుల్స్ పెట్టుకుని, ఒక చేతిలో సిగార్, మరో చేతిలో గన్, ఒళ్లో ల్యాండ్ లైన్ ఫోన్‌తో కూర్చున్న మాస్ రాజా మాస్ లుక్ అదిరిపోయింది. డిసెంబర్ 20న డిస్కోరాజా విడుదల కానుంది. ముందుగా 2020 సంక్రాంతికి విడుదల చెయ్యాలనుకున్నారు..

Read Also : చాణక్య : దసరా రిలీజ్..

కానీ, సంక్రాంతి బరిలో భారీ సినిమాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడం, థియేటర్ల ప్రాబ్లమ్ వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చెయ్యనున్నారు.బాబీ సింహా, తాన్యా హోప్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి.

 

 
 

×