డిసెంబర్ 20న డిస్కోరాజా

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానున్న మాస్ మహారాజా రవితేజ 'డిస్కోెరాజా'..

  • Published By: sekhar ,Published On : August 29, 2019 / 07:44 AM IST
డిసెంబర్ 20న డిస్కోరాజా

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానున్న మాస్ మహారాజా రవితేజ ‘డిస్కోెరాజా’..

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్‌లో డిస్కోరాజా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, ఎస్.ఆర్.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. నేల టికెట్ తర్వాత రవితేజతో ఆయన చేస్తున్న రెండో సినిమా ఇది.

ఇటీవలే ఢిల్లీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా డిస్కోరాజా టీజర్ రిలీజ్ చేస్తామని మొన్ననే ప్రకటించిన మూవీ యూనిట్ ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 20న డిస్కోరాజా థియేటర్స్‌లోకి రానున్నాడు. ముందుగా 2020 సంక్రాంతికి విడుదల చెయ్యాలనుకున్నారు.. కానీ, సంక్రాంతి బరిలో భారీ సినిమాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడం, థియేటర్ల ప్రాబ్లమ్ వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ చెయ్యనున్నారు. 

Read Also : గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్ – ఫస్ట్ లుక్..

తర్వాతి షెడ్యూల్ స్విట్జర్లాండ్‌లో జరుగనుంది. బాబీ సింహా, తాన్యా హోప్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి.