Ravi Teja: మాస్ రాజా షాకింగ్ డెసిషన్.. డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్!

కాలంతో పాటు మనం మారాలి అంటారు.. లేదు నేను ఇంకా కుర్రాడినే.. ఇప్పుడు కూడా యంగ్ హీరోయిన్స్ తో డ్యూయెట్ పాడతాం అంటే కుదరదు కదా..

Ravi Teja: మాస్ రాజా షాకింగ్ డెసిషన్.. డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్!

Raviteja

Ravi Teja: కాలంతో పాటు మనం మారాలి అంటారు.. లేదు నేను ఇంకా కుర్రాడినే.. ఇప్పుడు కూడా యంగ్ హీరోయిన్స్ తో డ్యూయెట్ పాడతాం అంటే కుదరదు కదా. మారిన పరిస్థితిలను అర్ధం చేసుకొని ముందుకెళ్తే ఆన్ స్క్రీన్ మీద మరింత కాలం స్టార్ డమ్ నిలబడుతుంది. సినీ ఇండస్ట్రీలో ఏదైనా సక్సెస్ మీదనే లెక్కలన్నీ ఉంటాయి. కనుక నటీనటులు ఆ సక్సెస్ ఎక్కడ ఉంటే అక్కడ వెతికి పట్టుకోవాలి. ఇప్పటికే కొందరు నటీనటులు అలా మారిపోయారు.

Ravi Teja: సినిమా ఒక్కటే.. హీరోయిన్స్ మాత్రం ఇద్దరు ముగ్గురు!

పెరిగిన వయసుకి తగ్గట్లు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు లాంటి వాళ్ళు హీరోయిజం మానేసి, విలక్షణ పాత్రలతో ప్రత్యేకతను చాటుకుంటున్న సంగతి తెలిసిందే. జగపతి బాబు కరెక్ట్ టైంలో కరెక్ట్ టర్న్ తీసుకున్నాడని ఇండస్ట్రీలో మిగతా నటీనటులు కూడా ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. కాగా.. ఇప్పుడు మాస్ రాజా రవితేజ కెరీర్ లో ఎన్నడూ చూడని దూకుడు చూపిస్తున్నాడు. కరోనా ఫస్ట్ వేవ్ లో వచ్చిన క్రాక్ సినిమాతో రవితేజ వరస సినిమాలను తీసుకొస్తున్నాడు.

Ravi Teja: కరోనా వేవ్‌ను సక్సెస్ వేవ్‌గా మార్చుకున్న మాస్ రాజా!

ప్రస్తుతం రవితేజ చేతిలో ఐదు సినిమాలు ఉండగా.. జూన్ 17న ‘రామారావు ఆన్ డ్యూటీ’తో పాటు ఇదే ఏడాది దసరాకు ‘ధమాకా’ చిత్రాలను విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే హీరోగా ఇంత బిజీగా ఉన్న రవితేజ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై కేవలం హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

Ravi Teja: ఫిప్త్ గేర్‌లో దూసుకెళుతున్న మాస్ రాజా!

తనకు కథ నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో కూడా నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని ఇప్పటికే దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన రవితేజ.. యంగ్ హీరోల సినిమాలలో ఇంపార్టెంట్ ఉన్న పాత్రలకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఓపెన్ గా చెప్పేశాడట. ఇప్పటికే మెగాస్టార్ చిరుతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న రవితేజ.. బాలయ్య సినిమాలో కూడా నటించనున్నాడని టాక్ నడుస్తుంది. మరి రవితేజ ఓపెన్ ఆఫర్ ఇచ్చేయడంతో మేకర్స్ ఏ హీరోలతో స్క్రీన్ స్పేస్ ఇస్తారో చూడాలి.