Khiladi: అట్టసూడకే.. మాస్ రాజా మరో సింగల్ వచ్చేసింది

మాస్ మహారాజా రవితేజ కొన్నాళ్ల క్రితం సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్న టైంలో అతని పట్టుకోవడం.. తట్టుకోవడం కూడా కష్టమే అనిపించేది. అయితే.. ఇప్పుడు క్రాక్ సక్సెస్ తో మళ్ళీ ఆ రేంజ్ ఊపు..

Khiladi: అట్టసూడకే.. మాస్ రాజా మరో సింగల్ వచ్చేసింది

Khiladi

Khiladi: మాస్ మహారాజా రవితేజ కొన్నాళ్ల క్రితం సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్న టైంలో అతని పట్టుకోవడం.. తట్టుకోవడం కూడా కష్టమే అనిపించేది. అయితే.. ఇప్పుడు క్రాక్ సక్సెస్ తో మళ్ళీ ఆ రేంజ్ ఊపు కనిపిస్తుంది అతనిలో. మామూలుగానే రవితేజలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువని చెప్తారు. అలాంటి ఎనర్జీకి క్రాక్ సక్సెస్ తోడు కావడంతో ఆయన దూకుడు మామూలుగా లేదు. కరోనా తర్వాత ఈ ఏడాది మొట్టమొదటి తెలుగు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన మాస్ మహారాజ అదే ఊపులో వరస సినిమాలను లైన్ లో పెట్టేశాడు.

Liger: గ్లింప్స్ వచ్చేశాయ్.. చావగొట్టేసిన పూరి-రౌడీ!

ప్రస్తుతం రవితేజ చేతిలో అరడజను సినిమాలు ఉండగా అందులో నాలుగు సినిమాలు షూటింగ్ లో ఉండగా మరో రెండు సెట్స్ మీద ఉన్నాయి. రామారావు రావు ఆన్ డ్యూటీ.. ఖిలాడీ సినిమాలు ముమ్మర షూటింగ్ లో ఉండగా ఖిలాడీ నుండి ఇప్పటికే వచ్చిన రెండు పాటలు.. టీజర్లు సినిమా మీద ఆసక్తిని పెంచాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా నుండి మరో సింగిల్ కూడా వచ్చేసింది. అట్టసూడకే అనే పాటని డిసెంబర్ 31న విడుదల చేయగా మాస్ రాజా మార్క్ టీజింగ్ తో కూడిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

NTR-Allu Arjun: బన్నీ వద్దనుకున్నా.. తారక్ కావాలనుకున్నాడు!

దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఏ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయతీ రవితేజ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండడం విశేషం.