Mega154: చిరుతో మాస్ రాజా హైస్పీడ్ షూటింగ్!

యంగ్ హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీ అయ్యారు చిరంజీవి. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ కాదు కానీ సినిమాలో స్టార్ అట్రాక్షన్ ఉండేలా జాగ్రత్తపడుతున్నారు మెగాస్టార్.

Mega154: చిరుతో మాస్ రాజా హైస్పీడ్ షూటింగ్!

Mega154

Mega154: యంగ్ హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీ అయ్యారు చిరంజీవి. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ కాదు కానీ సినిమాలో స్టార్ అట్రాక్షన్ ఉండేలా జాగ్రత్తపడుతున్నారు మెగాస్టార్. ప్రతి సినిమాలో తనకి తోడూ మరో స్టార్ ని సెట్ చేసుకుంటూ వాళ్లతో షూటింగ్ కూడా హై స్పీడ్ లో పూర్తి చేస్తున్నారు. ఇప్పుడా లిస్ట్ లోకి మాస్ రాజాను కూడా చేర్చేసారు.

Chiranjeevi : చరణ్‌కి ఇలా బర్త్‌డే విషెస్ చెప్పడం వింతగా ఉంది

స్టార్ సపోర్ట్ తీసుకుంటున్నారు.. వాళ్లతో హై స్పీడ్ లో షూటింగ్ కూడా చేసేస్తున్నారు చిరంజీవి. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో చిరూ తమ్ముడిగా రవితేజ నటిస్తున్నారు. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో వీళ్లిద్దరి మధ్య యాక్షన్ సీక్వెన్స్ బాబీ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వర్కింగ్ టైటిల్ వాల్తేరు వీరయ్య పేరుతో సెట్స్ పై ఉన్న ఈ మూవీలో చిరూ తమ్ముడిగా పోలీసాఫీసర్ గా రవితేజ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నట్టు చెప్తున్నారు.

Chiranjeevi: నాన్-స్టాప్‌గా కష్టపడుతున్న మెగాస్టార్!

చిరూ-బాబీ మూవీలో మాస్ రాజా సరసన కేథరీన్ థ్రెసా జంటగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. చిరూ సరసన శృతీ హాసన్ హీరోయిన్ గా కన్ఫర్మ్ కాగా మరో హీరోయిన్ గా మాళవిక మోహనన్ పేరు వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Chiranjeevi: మోహన్ లాల్‌పై పడ్డ చిరంజీవి.. మరోదానికి సై?

ఈమధ్యే గాడ్ ఫాదర్ మూవీ కోసం సల్మాన్ ఖాన్ తో పని కానిచ్చారు చిరంజీవి. రెమ్యునరేషన్ లేకుండా చిరూ కోసం నటించి సూపర్ అనిపించుకున్నాడు సల్లూబాయ్. కీర్తి సురేశ్ చెల్లెలిగా నటిస్తోన్న భోళాశంకర్ లోనూ ఓ యంగ్ హీరో కనిపిస్తాడనే టాక్ నడుస్తోంది. ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతున్న ఆచార్యలో కొడుకు మెగా పవర్ స్టార్ ను సెట్ చేసుకున్నారు. ఇద్దరి కాంబినేషన్ సీన్స్ కొరటాల అద్బుతంగా ఎగ్జిక్యూట్ చేసారనే నమ్మకముంది.