Sarkaru Vaari Paata : మ.. మ.. మహేశా.. మాస్ సాంగ్‌తో రాబోతున్న సూపర్‌స్టార్..

ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ సినిమాలో ఒక మాస్ సాంగ్ ఉందని, అది ముందొచ్చిన రెండు పాటల కంటే కూడా బాగా హిట్ అవుతుందని, అందులో మహేష్ డ్యాన్స్ కూడా అదిరిపోతుందని.............

Sarkaru Vaari Paata : మ.. మ.. మహేశా.. మాస్ సాంగ్‌తో రాబోతున్న సూపర్‌స్టార్..

Mahesh

Sarkaru Vaari Paata :  మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాని దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి, ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కళావతి, పెన్నీ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇందులోని స్టెప్స్ కూడా వైరల్ అయి సినిమాకి మరింత హైప్ ని తీసుకొచ్చాయి. ఇటీవలే సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్ అయి అందరి అంచనాలని పెంచేసింది.

ఈ ట్రైలర్ చూసిన వారంతా అదిరిపోయింది, సినిమా కోసం వెయిటింగ్ అంటున్నారు. ఇక ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులని క్రియేట్ చేసింది. ట్రైలర్ చూసిన దగ్గర్నుంచి సినిమా ఎప్పుడు చూద్దామా అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ సినిమాలో ఒక మాస్ సాంగ్ ఉందని, అది ముందొచ్చిన రెండు పాటల కంటే కూడా బాగా హిట్ అవుతుందని, అందులో మహేష్ డ్యాన్స్ కూడా అదిరిపోతుందని చెప్పాడు.

Sai Dharam Tej : విశ్వక్‌సేన్‌కి మెగా హీరో సపోర్ట్

తాజాగా చిత్ర బృందం ఈ పాటపై అప్డేట్ ఇచ్చింది. సర్కారు వారి పాట సినిమాలోంచి మ..మ.. మహేశా అనే సాంగ్ మే 7వ తేదీన రిలీజ్ కానుంది అని అనౌన్స్ చేశారు. అయితే ఆ రోజున ఏ టైంకి రిలీజ్ చేస్తారు అనేది ఇంకా ప్రకటించలేదు. సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 7న హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో జరగనుంది. ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.