రామ్ చరణ్ రిలీజ్ చేసిన ‘మత్తు వదలరా’ టీజర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతులమీదుగా ‘మత్తు వదలరా’ టీజర్ విడుదల.. సినిమా డిసెంబర్ 25 రిలీజ్..

  • Published By: sekhar ,Published On : December 9, 2019 / 06:29 AM IST
రామ్ చరణ్ రిలీజ్ చేసిన ‘మత్తు వదలరా’ టీజర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతులమీదుగా ‘మత్తు వదలరా’ టీజర్ విడుదల.. సినిమా డిసెంబర్ 25 రిలీజ్..

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెద్ద కొడుకు తన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా, రెండో కొడుకు శ్రీ సింహా కోడూరి హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘మత్తు వదలరా’.. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా రితేష్ రానా దర్శకుడిగా పరిచయవుతున్నాడు.

Image result for mathu vadalara first look

ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతులమీదుగా విడుదలైంది. ‘నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం.. ఈ రోజు మనం చర్చించబోయే అంశం.. అతినిద్ర యెక్క లక్షణాలు.. అలుపు, అసహనం, ఆగ్రహం, ఆరాటం, మతి భ్రమణ’ అంటూ అతినిద్ర అనే అరుదైన వ్యాధి కలిగిన హీరో దానివల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది ఈ సినిమా కథ అనే విషయాన్ని టీజర్ ద్వారా చూపించారు.

Image

 

శ్రీ సింహా నటన ఆకట్టుకునేలా ఉంది. వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానందీ చిత్రం.. కెమెరా : సురేష్ సారంగం, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, సంగీతం : కాల భైరవ, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, నిర్మాతలు : చిరంజీవి (చెర్రీ) – సుమలత.