‘మత్తు వదలరా’ – సాలా రే సాలా సాంగ్

‘మత్తు వదలరా’ సినిమాలోని సాలా రే సాలా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్..

  • Published By: sekhar ,Published On : December 13, 2019 / 11:56 AM IST
‘మత్తు వదలరా’ – సాలా రే సాలా సాంగ్

‘మత్తు వదలరా’ సినిమాలోని సాలా రే సాలా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్..

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెద్ద కొడుకు (దండాలయ్యా.. పెనిమిటి) వంటి పలు పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా, రెండో కొడుకు శ్రీ సింహా కోడూరి హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘మత్తు వదలరా’.. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా రితేష్ రానా దర్శకుడిగా పరిచయవుతున్నాడు.

Image

ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  చేతులమీదుగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటున్నాయి. విడుదలకు తక్కువ టైమ్ ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. శుక్రవారం సాయంత్రం ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. కాల భైరవ ట్యూన్ కంపోజ్ చేయగా రాకేందు మౌళి లిరిక్స్ రాశారు.

Image

పృధ్వీ చంద్ర పాడారు. ‘‘ఏమైందో తెలియని తికమక.. మత్తెక్కే అణువణున ఇక.. మైకం కమ్మిందీ మనసుకా.. ఎటుగా పోతుందో కథ ఇక’’ అంటూ సాగే ఈ పాటలో హీరోకి ఉన్న డిజార్డర్ గురించి అతని క్యారెక్టర్ గురించి చెప్పారు. వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు.. కెమెరా : సురేష్ సారంగం, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, సంగీతం : కాల భైరవ, ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్, నిర్మాతలు : చిరంజీవి (చెర్రీ) – సుమలత.