Mehreen Pirzada : కాబోయే భర్తతో ఏకాంతంగా

గ్లామర్ బ్యూటీ మెహరీన్ తన కాబోయే భర్త భవ్య బిష్ణోయ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఆయనతో ఏకాంతంగా గడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Mehreen Pirzada : కాబోయే భర్తతో ఏకాంతంగా

Mehreen Pirzada

Mehreen Pirzada’s BF Bhavya : గ్లామర్ బ్యూటీ మెహరీన్ తన కాబోయే భర్త భవ్య బిష్ణోయ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఆయనతో ఏకాంతంగా గడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ పూర్తయిన సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి పీఠలెక్కనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఏకాంతంగా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రంలో పంజాబీ ముద్దుగుమ్మ మహాలక్ష్మీగా నటించి..ప్రేక్షకులను మెప్పించిన గ్లామర్ బ్యూటీ మెహరీన్. 2019లో ఎఫ్ – 2లో హనీగా నటించారు.

ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్రస్తుతం ఎఫ్ – 3 చేస్తోంది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ లీడర్ భవ్య బిష్ణోయ్ తో లాక్ డౌన్ లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా సాన్నిహిత్యాన్ని పెంచింది. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం భవ్య అండమాన్ వెళ్లారు. అక్కడ..స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో ‘విల్ యూ మ్యారీ మీ’ అనే కార్డుతో భవ్య తనను సర్ ఫ్రైజ్ చేశారని..తాను ఒకే చెప్పినట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ సంగతులను మెహరీన్ ఆసక్తికరంగా చెప్పారు.

వీరిద్దరి ప్రేమ వివాహానికి దారి తీసింది. ఇటీవలే ఎంగేజ్ మెంట్ జరుపుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో భవ్యతో కలిసి ఏకాంతంగా దిగిన ఫొటోలను మెహరీన్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. తామిద్దరం కలకాలం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నట్లు కామెంట్స్ చేశారు. భవ్యగాడితో మెహరీన్ వీర ప్రేమ గాథ అంటూ..నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read More : Massage Centers : స్పా సెంటర్..యువకులకు గాలం..పచ్చి వ్యభిచారం పోలీసులు దాడులు