Meera Chopra : ఇంట్లోంచి గెంటేశాడని కంప్లైంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

తెలుగులో పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీరా చోప్రా. ఆ తర్వాత తెలుగులో వాన, మారో, గ్రీకు వీరుడు లాంటి సినిమాలు చేసింది. తెలుగులో ఎక్కువ గుర్తింపు

10TV Telugu News

Meera Chopra : తెలుగులో పవన్ కళ్యాణ్ ‘బంగారం’ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీరా చోప్రా. ఆ తర్వాత తెలుగులో వాన, మారో, గ్రీకు వీరుడు లాంటి సినిమాలు చేసింది. తెలుగులో ఎక్కువ గుర్తింపు రాకపోవటంతో తమిళ్, హిందీలో సెట్ అయిపోయింది. తెలుగులో కనిపించడం మానేసింది. ‘బంగారం’ సినిమాతో మాత్రం మంచి పేరు తెచ్చుకుంది మీరా. ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తూ బాలీవుడ్‌ లోనే సెటిల్‌ అయింది ఈ భామ.

Payal Rajputh : హైదరాబాద్ లో కొత్త ఇల్లు కొని సెటిల్ అయిన పాయల్

తాజాగా మీరా చోప్రా ఇంటీరియర్‌ డిజైనర్‌ రాజేందర్‌ దివాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల మీరా ముంబైలో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. ఆ ఇంటిని అలంకరించేందుకు ఇంటీరియర్‌ డిజైనర్‌ రాజేందర్‌ తో రూ.17 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా రూ. 8 లక్షలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చింది. షూట్‌ కోసం కొన్ని రోజులు బయటికి వెళ్లి వచ్చేసరికి నాణ్యత లేని మెటీరియల్‌ తో ఇల్లు డిజైన్‌ చేశాడని గ్రహించింది. ఇదేంటని రాజేందర్ ని ప్రశ్నిస్తే తన ఇంట్లో నుంచి తననే బయటికి గెంటేశాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది మీరా చోప్రా.

×