Niharika Konidela: ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు.. ఇన్‌స్టాలోకి మెగా డాటర్ రీ ఎంట్రీ!

మెగా డాటర్ నిహారిక తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు నిర్మాతగా కూడా చేస్తూ కెరీర్ ని ప్లాన్ చేసుకుంది. అయితే సినిమాలలో అంత సక్సెస్ రాకపోయినా యూట్యూబ్ లో, నిర్మాతగా మాత్రం ముందుకెళ్తుంది.

Niharika Konidela: ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు.. ఇన్‌స్టాలోకి మెగా డాటర్ రీ ఎంట్రీ!

Niharika Konidela

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. హీరోయిన్ గా సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు నిర్మాతగా కూడా చేస్తూ కెరీర్ ని ప్లాన్ చేసుకుంది. అయితే సినిమాలలో అంత సక్సెస్ రాకపోయినా యూట్యూబ్ లో, నిర్మాతగా మాత్రం ముందుకెళ్తుంది. మధ్యలో సడెన్ గా చైతన్యని పెళ్లి చేసుకుంది. అయినా పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయకపోయినా వెబ్ సిరీస్ లలో నటిస్తానని, నిర్మాతగా సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తానని గతంలోనే ప్రకటించింది.

Niharika : షార్ట్ హెయిర్, షార్ట్ నిక్కర్‌తో జిమ్‌లో నిహారిక.. పబ్ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైం బయటకి..

అయితే తాజాగా ఈ మెగా డాటర్ నిహారిక లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసింది. సెలబ్రిటీలు సాధారణంగా సోషల్ మీడియాతోనే తమ అభిమానులతో టచ్ లో ఉంటారు. తమకి సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారానే తెలియచేస్తారు. కానీ.. నిహారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసింది. అప్పుడు ఎందుకు ఆమె డిలీట్ చేసిందో ఎవరికీ అర్ధం కాలేదు. ముఖ్యంగా మెగా అభిమానులు నిహారికా ఇన్ స్టాకు దూరమవడంతో తెగ బాధ పడిపోయారు.

Niharika – Chaitanya : నన్ను పట్టించుకోకుండా నిహారికకు ఎప్పుడూ అదే పని : నిహారిక భర్త

అయితే.. నిహారిక తాజాగా మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ”ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు.. ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను.. ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్‌ అయ్యాను. పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను” అంటూ నిహారిక చేసిన పోస్ట్‌ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. నిహారికా రీ ఎంట్రీతో మెగా అభిమానులు ఆమెకు మళ్ళీ గ్రాండ్ వెల్కమ్ చెప్తూ పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)