Pushpa 2: పుష్ప-2లో మెగా డాటర్.. అలాంటి రోల్‌లో నటిస్తుందా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప-2’ మూవీలో మెగా డాటర్ నిహారిక ఓ కేమియో రోల్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Pushpa 2: పుష్ప-2లో మెగా డాటర్.. అలాంటి రోల్‌లో నటిస్తుందా..?

Mega Daughter Niharika To Star In Pushpa 2

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకునేందుకు బన్నీ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఈ సినిమాపై నెక్ట్స్ లెవెల్ అంచనాలను క్రియేట్ చేశాయి.

Pushpa 2: ఆడియో రైట్స్‌తో ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేస్తున్న పుష్ప-2..?

కాగా, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో మరో యాక్టర్ కూడా జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల పుష్ప-2 సినిమాలో నటించనుందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. పుష్ప-2 మూవీలో ఓ గిరిజన యువతి పాత్రలో కేమియో రోల్‌లో నటించేందుకు మెగా డాటర్ నిహారికను చిత్ర యూనిట్ సంప్రదించినట్లుగా తెలుస్తోంది. పుష్ప-2లో నటించే ఆఫర్ రావడంతో నిహారిక కూడా వెంటనే ఓకే చెప్పేసిందట.

Pushpa 2 : పుష్ప గెటప్‌ కోసం డేవిడ్ వార్నర్.. రూ.10,001 ఎవరకి పంపించాడు?

ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారడంతో, నిజంగానే పుష్ప-2 మూవీలో నిహారిక నటిస్తుందా అనే చర్చ సాగుతోంది. ఇక పుష్ప-2లో బన్నీ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ కాగా, ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.