నూర్ మహ్మద్ కన్నుమూత : మెగా ఫ్యామిలీ సంతాపం

  • Published By: madhu ,Published On : December 8, 2019 / 07:07 AM IST
నూర్ మహ్మద్ కన్నుమూత : మెగా ఫ్యామిలీ సంతాపం

మెగాస్టార్ కుటుంబానికి అభిమానిగా కొనసాగుతున్న నూర్ భాయ్ ఇక లేరు. ఆయన 2019, డిసెంబర్ 08వ తేదీ ఆదివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో కన్నుమూసిన ఆయనకు మెగా ఫ్యామిలీ నివాళులర్పించింది. నటుడు రామ్ చరణ్ తేజ ఇటీవలే స్వయంగా ఆస్పత్రికి వెళ్లి నూర్ భాయ్‌ను పరామర్శించారు. మెగా ఫ్యామిలీ హీరోలకు వీరాభిమానిగా, మెగా ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడిగా నూర్ భాయ్ కొనసాగుతున్నారు. ఈయన మృతి చెందడంతో మెగా హీరోలు, మెగా ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సంతాపాలు తెలియచేస్తున్నారు. 

నూర్ భాయ్ విషయానికి వస్తే..చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్..ఇలా మెగా హీరోలకు సన్నిహితంగా మెలిగాే వారు. మెగా అభిమానులను ఒక్కతాటిపైకి నడిపించడంలో నూర్ కృషి చేశారు. అలాగే సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడంలో ముందుండేవారు. ఆయన్ను కేవలం అభిమానిగానే కాకుండా..కుటుంబంలోని వ్యక్తిగా చూసేవారు మెగా ఫ్యామిలీ. వీరాభిమాని మృతితో మెగా హీరోలు తమ తమ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు. 
Read More : వెంకీ మామ : రాశీఖన్నా..పాయల్ రాజ్ పుత్ టిక్ టాక్ వీడియో

Shocked and pained to hear about the death of our beloved Noor Bhai. He was like family. Always celebrated our birthdays like his own, sent food during festivals and showered so much love. His demise is truly a loss to our family. pic.twitter.com/0lSoFCYtnB