Mega Family : సీక్రెట్ శాంటా కోసం గ్యాంగ్ అప్ అయిన మెగా ఫ్యామిలీ..

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోటికి చేరుకున్నారు. ఏ పండగా వచ్చినా, మెగాహీరోలు అంత ఒక చోటు చేరి సందడి చేస్తుంటారు. తాజాగా క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీక్రెట్ శాంటా ఈవెంట్ ని నిర్వహించారు.

Mega Family : సీక్రెట్ శాంటా కోసం గ్యాంగ్ అప్ అయిన మెగా ఫ్యామిలీ..

Mega Family gather for Christmas celebrations

Mega Family : ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోటికి చేరుకున్నారు. ఏ పండగా వచ్చినా, మెగాహీరోలు అంత ఒక చోటు చేరి సందడి చేస్తుంటారు. తాజాగా క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీక్రెట్ శాంటా ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ, నిహారిక తదితరులు పాల్గొన్నారు.

Ram Charan: చరణ్ మూవీలో మోహన్ లాల్ అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?

కాగా ఈ ‘సీక్రెట్ శాంటా’ అంటే ఏంటంటే.. ఒకరికి ఒకరు సీక్రెట్ గిఫ్ట్స్ ఇచ్చుపుచ్చుకోవడం. దీంతో నిన్న మెగా కజిన్స్ అందరూ ఇందులో పాల్గొని ఒకరికి ఒకరు గిఫ్ట్స్ అందజేసుకున్నారు. ఇక ఈ ఈవెంట్ లో అందరూ కలిసి దిగిన ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. ఇక ఆ ఫొటోలో మెగాహీరోలు అందర్నీ ఒకచోట చూసిన అభిమానులకి కన్నుల విందుల ఉంది. అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి పాల్గొనలేదు.

కాగా ఇటీవలే రామ్ చరణ్ అండ్ ఉపాసన అమ్మానాన్నలు కాబోతున్నట్లు చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లి అయిన 10 ఏళ్ళ తరువాత ఇప్పుడు వీరిద్దరూ ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నారు. ఈ విషయం తెలిసిన తరువాత మెగాహీరోలు అంతా ఒకచోట కలవడం ఇదే తొలిసారి. మెగా వారసుడు రాకతో మరెంత ఆనందం నెలకొంది మెగా కుటుంబం మధ్య.