Mega Heroes: థియేటర్ల మీద మెగా హీరోల దండయాత్ర.. మేజర్ షేర్ వీళ్లదే!

మెగా ఫ్యామిలీలో సినిమా జాతర జరగతోంది. మెగా ఫ్యామిలీ మొత్తం వరుస సినిమాలతో బాక్సాఫీస్ మీద దాడిచెయ్యబోతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సినిమాలతో ధియేటర్లలో దండయాత్ర..

Mega Heroes: థియేటర్ల మీద మెగా హీరోల దండయాత్ర.. మేజర్ షేర్ వీళ్లదే!

Mega Heroes

Mega Heroes: మెగా ఫ్యామిలీలో సినిమా జాతర జరగతోంది. మెగా ఫ్యామిలీ మొత్తం వరుస సినిమాలతో బాక్సాఫీస్ మీద దాడిచెయ్యబోతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సినిమాలతో ధియేటర్లలో దండయాత్ర చెయ్యడానికి రెడీ అవుతున్నారు మెగా హీరోలు. మెగాస్టార్ దగ్గరనుంచి నిన్నకాక మొన్నొచ్చిన వైష్ణవ్ తేజ్ వరకూ ఒక్కొక్కిరి సినిమాలు వరసపెట్టి థియేటర్ల మీదకి వదలనున్నారు. ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ నుంచి సాలిడ్ గా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మినిమం నెలకొక మెగా హీరో.. ఫ్యాన్స్ ని పలకరించబోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. మెగా ఫ్యామిలీలో సీనియర్ హీరో చిరంజీవి దగ్గరనుంచి యంగ్ హీరో వైష్నవ్ తేజ్ వరకూ మొత్తం 22 సినిమాలతో టాలీవుడ్ టాప్ షేర్ మూవీస్ ని చేతిలో పెట్టుకుని బిజీగా ఉన్నారు.

Kangana Ranaut: బాలీవుడ్‌పై అక్కసు.. కంగనా శ్రీరంగనీతులు!

ముందుగా మెగాస్టార్ చిరంజీవి.. లాస్ట్ ఇయర్ మిస్ అయిన ఆచార్య సినిమాని ఈ సంవత్సరం రిలీజ్ చెయ్యడమే కాకుండా మరో సినిమా యాడ్ చేసి మరీ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు. కొరటాల శివతో చేస్తున్న ఆచార్యని ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తుంటే.. మోహన్ రాజాతో స్టార్ట్ చేసిన లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ కూడా ఈ సంవత్సరం లాస్ట్ కే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్. ఈ రెండుసినిమాలాతో పాటు మెహర్ రమేష్ తో భోళా శంకర్, బాబీ డైరెక్షన్లో మరో మాస్ సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్లో మరో సినిమా అనౌన్స్ చేసి మొత్తం 5 సినిమాలతో సీనియర్ హీరో అయిన మెగాస్టార్ టాప్ ప్లేస్ లో ఉన్నారు.

Prabhas Movies: పాపం ప్రభాస్.. ఆగని గ్లోబల్ స్టార్ వాయిదాల పర్వం!

మెగాస్టార్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న పవర్ స్టార్ కూడా అసలుకి వడ్డీ కలిపి కొడదామని ముందే ఫిక్స్ అయ్యారు. అందుకే సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చెయ్యగానే వరసగా సినిమాలు స్టార్ట్ చేశారు. ఇప్పటికే లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన భీమ్లానాయక్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఫిబ్రవరి 25న భీమ్లా థియేటర్లలో దిగనున్నాడు. భీమ్లానాయక్ తో పాటు హరిహర వీరమల్లు సినిమాల్ని ప్యార్లల్ గా షూట్ చేస్తున్నారు. అంతేకాదు.. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే మాస్ కాప్ ఎంటర్ టైనర్ తో పాటు.. సురేందర్ రెడ్డితో ఇంట్రస్టింగ్ మూవీ అనౌన్స్ చేసి మొత్తం 4 సినిమాలతో ఫుల్ బిజీగా సెకండ్ ప్లేస్ లోఉన్నారు పవర్ స్టార్.

Sreeleela: క్రేజీ ఆఫర్లు.. వరుస సినిమాలకు సైన్ చేస్తున్న శ్రీలీల?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 4 సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సంవత్సరం చరణ్ రిలీజ్ చేస్తున్న రెండు సినిమాలు కూడా మల్టీస్టారర్సే. ఒకటి రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ట్రిపుల్ ఆర్, మరొకటి చిరంజీవితో కొరటాల కాంబినేషన్లో వస్తున్న ఆచార్య. ఈ రెండు సినిమాలతో పాటు స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న మూవీతో పాటు గౌతమ్ తిన్ననూరితో మరో సినిమా అనౌన్స్ చేసి మొత్తం 4 సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు చరణ్.

Kiran Abbavaram: సెబాస్టియన్ వీడియో సాంగ్.. నీ మాట వింటే రాదా మైమరపే..!

చిరంజీవి ఫ్యామిలీ తర్వాత ఆ రేంజ్ లో మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న హీరో బన్నీ. ఈ ఎనర్జిటిక్ స్టార్ స్పీడ్ ని సక్సెస్ ని చూసి.. ఒక రేంజ్ లో మెగా వారసుల్ని కూడా ఓవర్ టేక్ చేస్తాడేమో అన్న డౌట్ క్రియేట్ చేస్తారు. లేట్ అయినా లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. ఆ సక్సెస్ ని కంటిన్యూ చెయ్యడానికి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు బన్నీ. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గాకొత్త అవతారం ఎత్తిన బన్నీ.. ఈసినిమా సక్సెస్ తో తన రేంజ్ ని మరింత పెంచుకోడానికి వరసగా సాలిడ్ సినిమాలు ప్లాన్ చేశారు. ప్రజెంట్ పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. కొరటాలతో అనౌన్స్ చేసిన సినిమాతో పాటు.. ఐకాన్ సినిమాని హోల్డ్ చేసి పెట్టి మొత్తం 3 సినిమాలతో లైనప్ చేసుకున్నారు.

Bheemla Nayak: కలెక్షన్ల సునామీకి పవర్ స్టార్ స్కెచ్… ఫ్యాన్స్‌కు పునకాలే!

మెగా మేనల్లుడిగా మంచి క్రేజ్ సంపాదించుకుని ఆ మధ్య వరసగా సినిమాలు చేసిన సాయిదరమ్ తేజ్.. లాస్ట్ ఇయర్ జరిగిన యాక్సిడెంట్ తో కాస్త డల్ అయ్యారు. రిపబ్లిక్ రిలీజ్ చేసి మంచి పేరు తెచ్చుకున్న సాయి తేజ్.. కార్తీక్ అనేయంగ్ డైరెక్టర్ తో మిస్టిక్ థ్రిల్లర్ మూవీతో ఎంగేజ్ అయ్యి ఉన్నారు. మెగాఫ్యామిలీలో రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా సమ్ థింగ్ డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ.. కెరీర్ ని కంటిన్యూ చేస్తున్న వరుణ్ తేజ్.. బాక్సర్ గా రింగ్ లోకి దిగబోతున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న గని సినిమాతో పాటు వెంకటేష్ తో చేస్తున్న ఎఫ్ 3.. ఇలా 2 సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

Movies Leakage: లీకుల బెడద.. ఇప్పుడు మరింత స్ట్రిక్ట్!

లాస్ట్ ఇయర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్నవ్ తేజ్ కూడా ఇలా వచ్చాడో లేదో.. అలా వరసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఉప్పెన, కొండపొలం సినిమాల తర్వాత.. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ రంగరంఘ వైభవంగా అనే సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు లేటెస్ట్ గా అన్నపూర్ణ స్టూడియోతో మరో సినిమా అనౌన్స్ చేసి 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు వైష్ణవ్. హిట్, ఫ్లాపులతో సంబందం లేకుండా వరసగా సినిమాలు చేస్తూ..నంబర్స్ పెంచుకుంటున్న ఈ మెగా హీరోలతో పాటుగా అప్పుడప్పుడు సినిమాలుచేసే అల్లుశిరీష్ కూడా ఈమధ్య కొత్త సినిమాతో బిజీ అయ్యారు. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా ప్రేమ కాదంట అనే టైటిల్ తో మోడర్న్ డే లవ్ స్టోరీ గా ఓ సినిమా చేస్తున్నారు అల్లు శిరీష్. ఇలా క్రేజ్, కలెక్షన్లతో సంబందం లేకుండా వరసగా సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లో ఏ ఫ్యామిలీకీ లేనన్ని 22 సినిమాలతో మెగా ఫ్యామిలీ ఫుల్ బిజీగాఉంది.