కజిన్ పంజా వైష్ణవ్ తేజ్‌ కు చరణ్ వెల్కమ్

పంజా వైష్ణవ్ తేజ్‌ను చిత్రసీమలోకి ఆహ్వానిస్తూ ‘ఉప్పెన’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియచేసిన రామ్ చరణ్..

  • Published By: sekhar ,Published On : February 21, 2020 / 02:41 PM IST
కజిన్ పంజా వైష్ణవ్ తేజ్‌ కు చరణ్ వెల్కమ్

పంజా వైష్ణవ్ తేజ్‌ను చిత్రసీమలోకి ఆహ్వానిస్తూ ‘ఉప్పెన’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియచేసిన రామ్ చరణ్..

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తన కజిన్ పంజా వైష్ణవ్ తేజ్‌ను ఆహ్వానిస్తూ, అతను హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన‘ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్‌లో.. “బిగ్ వెల్కమ్ వైష్ణవ్ తేజ్! ఈ జర్నీని నువ్వు ప్రేమిస్తావు. పూర్తి స్థాయిలో దీన్ని ఆస్వాదించు. బుచ్చిబాబు సానా, కృతి శెట్టి, మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని పోస్ట్ చేశారు చరణ్. ఈ మహా శివరాత్రి స్పెషల్ పోస్టర్‌లో హీరోయిన్ కృతి శెట్టిని ఫాలో అవుతూ కనిపిస్తున్నాడు వైష్ణవ్ తేజ్.

బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతమందిస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ప్రధాన తారాగణం
పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ
సాంకేతిక వర్గం
మ్యూజిక్ : దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ : శాందత్ సైనుద్దీన్
ఎడిటర్ : నవీన్ నూలి
ఆర్ట్ : మౌనిక రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి.
సీఈఓ : చెర్రీ
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
కథ, దర్శకత్వం : బుచ్చిబాబు సానా
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్.
 

Uppena

Read More>>సనా ఆంటీ షేకాడించిందిగా!

See Also>> ఢమరుకం మోగిస్తూ..శివుడి గెటప్‌లో శ్రీరెడ్డి చిందులు..