Varun Tej: రెండు సినిమాలతో వస్తోన్న మెగా ప్రిన్స్.. ఛాంపియన్ గెలుస్తాడా?

వరుణ్ తేజ్ రూటే సపరేటు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా కూడా ఇమేజ్ చట్రంలో ఇరుక్క పోకుండా.. స్టార్ స్టేటస్ కోసం పాకులాడకుండా.. మాస్ క్లాస్ తేడాలేకుండా, సక్సెస్ ఫెయిల్యూర్..

Varun Tej: రెండు సినిమాలతో వస్తోన్న మెగా ప్రిన్స్.. ఛాంపియన్ గెలుస్తాడా?

Varun Tej: వరుణ్ తేజ్ రూటే సపరేటు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా కూడా ఇమేజ్ చట్రంలో ఇరుక్క పోకుండా.. స్టార్ స్టేటస్ కోసం పాకులాడకుండా.. మాస్ క్లాస్ తేడాలేకుండా, సక్సెస్ ఫెయిల్యూర్ లెక్కలేసుకోకుండా ఏ సినిమాకు ఆ సినిమా డిఫరెంట్ గా చేస్తూ సక్సెస్ అవుతున్నాడు వరుణ్ తేజ్. లేటస్ట్ గా సమ్మర్ బరిలో ఏకంగా రెండు విభిన్న సినిమాలతో రంగంలోకి దిగుతున్నాడు.

Devi Sri Prasad: అరగంటలో 6 పాటలు కంపోజ్ చేసిన దేవిశ్రీ.. ఏ సినిమా కోసమంటే?

కోవిడ్ పుణ్యమా అని స్టార్ హీరోలు ఒక్క సినిమాను రిలీజ్ చేయడానికి నానాతంటాలు పడుతుంటే, వరుణ్ తేజ్ మాత్రం రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. ఒకటి సమ్మర్ మొదలవగానే రిలీజ్ అయితే, మరొకటి సమ్మర్ మిడిల్ కి రీలీజ్ కానుంది. గని సినిమాలో బాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ గా గని టీమ్ ప్రచారం స్పీడ్ అందుకుంది. విజయవాడ టూర్ లో గని టీమ్ సందడి చేసింది.

Aishwarya Rai: లతా మంగేష్కర్ కి ఐష్ నివాళి.. నెటిజన్ల ట్రోల్స్!

ఫిబ్రవరి 25న లేదా మార్చి 4న భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న గని సినిమాలో వరుణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ నటిస్తోంది. వరుణ్ తేజ్ మరో సినిమా ఎఫ్ 3 కూడా గని వచ్చిన రెండు నెలల గ్యాప్ లోనే ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎఫ్ 3 నుండి రీలీజ్ అయిన టీజర్ తో పాటు లేటస్ట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా ట్రెండింగ్ అవుతంది.

Chiranjeevi : మళ్ళీ కమర్షియల్ యాడ్స్‌లోకి మెగాస్టార్??

ఎఫ్ 2కు సీక్వెల్ గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవుటండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ మూవీ ఎఫ్ 3. ఈ రెండు సినిమాలతో డిఫరెంట్ జానర్స్ లో వస్తోన్న వరుణ్ తేజ్, ఈ ఇయర్ సమ్మర్ వార్ లో గెలిచి ఛాంపియన్ గా నిలుస్తాడంటున్నారు మెగా ఫాన్స్.