Chiranjeevi – Sukumar: చిరుతో సుక్కు సినిమా.. కల నిజమైందన్న లెక్కల మాస్టారు

సంవత్సరాల తరబడి ఎదురుచూసిన కల నిజమైందంటున్నారు సుకుమార్. మెగా స్టార్ చిరంజీవితో సినిమా తీయాలని చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయని మెగాస్టార్..

Chiranjeevi – Sukumar: చిరుతో సుక్కు సినిమా.. కల నిజమైందన్న లెక్కల మాస్టారు

Sukumar

Mega Star – Sukumar: సంవత్సరాల తరబడి ఎదురుచూసిన కల నిజమైందంటున్నారు సుకుమార్. మెగా స్టార్ చిరంజీవితో సినిమా తీయాలని చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయని మెగాస్టార్ దానికి ఒప్పుకున్నారంటూ సుకుమార్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఈ లెక్కల మాష్టారు.

2004లో డైరక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్.. తొలి సినిమాతోనే హిట్ కొట్టేశారు. రీసెంట్‌గా పుష్ప సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సుక్కూ.. మెగా స్టార్ తో చేయబోయే సినిమాకు మెగా ఫోన్ పట్టుకుంటున్నారంటే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.

పుష్పకు ముందు మెగా ఫ్యామిలీ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లతో చేసి ఇప్పుడు మెగా శిఖరాన్నే డైరక్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో చిరంజీవి, సుకుమార్ లతో పాటు మరో ఇద్దరు ఉండగా.. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also : సుకుమార్ నిర్మాణంలో ‘రౌడీ బాయ్స్’ హీరో రెండో సినిమా